ఆలేరు అభివృద్ధికి రూ.28.74 కోట్లు : గొంగిడి మహేందర్ రెడ్డి

ఆలేరు అభివృద్ధికి రూ.28.74 కోట్లు : గొంగిడి మహేందర్ రెడ్డి
  • డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి

యాదగిరిగుట్ట, వెలుగు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.28.74 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ స్టేట్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్టలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయన మాట్లాడుతూ చెక్ డ్యాంల నిర్మాణం కోసం ఇరిగేషన్ శాఖ నుంచి రూ.24.02 కోట్లు, సీడీఎఫ్ నుంచి రూ.4.71 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు.  

ఇరిగేషన్ నిధులతో యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, చిన్నకందుకూరు.. మోటకొండూర్ మండలం సికిందర్ నగర్,  రాజాపేట మండలం రేణిగుంట, ఆలేరు మండలం కొలనుపాక, ఆత్మకూరు(ఎం) మండలం ఆత్మకూర్, ఉప్పలపహాడ్ గ్రామాల్లో 7 చెక్ డ్యాంలను నిర్మించనున్నట్లు వెల్లడించారు.  సీడీఎఫ్ నిధులతో గ్రామాలలో కమ్యూనిటీ, యూత్ బిల్డింగ్‌లు నిర్మిస్తామని చెప్పారు.