పేదలకు అధునాతన వైద్యమే లక్ష్యం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

పేదలకు అధునాతన వైద్యమే లక్ష్యం :  మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో లాప్రోస్కోపీ యూనిట్ ప్రారంభం

నల్గొండ, వెలుగు: పేదలకు అధునాతన వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తెలిపారు. సోమవారం నల్గొండలోని జిల్లా ఆసుపత్రిలో ప్రతీక్  ఫౌండేషన్  ఆధ్వర్యంలో రూ. కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన లాప్రోస్కోపిక్  యూనిట్ ను పద్మవిభూషణ్  డాక్టర్  నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నానని, ఏడాదిలోనే గవర్నమెంట్​ మెడికల్​ కాలేజీ నిర్మించామని తెలిపారు. 

రూ.40 కోట్లతో నర్సింగ్  కాలేజీ కట్టిస్తున్నామని చెప్పారు. ఎంబీబీఎస్​ పూర్తి చేసిన వారికి ఏఐజీ ఆసుపత్రిలో ఇంటర్న్​షిప్  ట్రైనింగ్​ చేసే అవకాశం కల్పించాలని కోరారు. డాక్టర్  నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాధునిక, ఉన్నత స్థాయి ప్రమాణాలు కలిగిన లాప్రోస్కోపిక్  యూనిట్  ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. దీంతో వివిధ రకాల ఆపరేషన్లకు హైదరాబాద్​ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు.

 నల్గొండ మెడికల్​ కాలేజీని దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. డాక్టర్  జీవీ రావు, చారిటీ నిర్వాహకులు ఎస్పీ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్  బీర్ల ఐలయ్య, అడిషనల్​ కలెక్టర్  జె శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్  అరుణకుమారి, డీఎంహెచ్ వో పుట్ల శ్రీనివాస్  పాల్గొన్నారు.