స్కూల్స్ ఓపెన్‌పై గైడ్‌లైన్స్ లేవ్

స్కూల్స్ ఓపెన్‌పై గైడ్‌లైన్స్ లేవ్

రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి స్కూళ్లను తెరవాలని ప్రకటించిన సర్కారు వాటి నిర్వహణపై గైడ్ లైన్స్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. వారం రోజులలు స్కూలుంటుంది,,క్లాసులెలా నిర్వహించాలి, ఒక్కో క్లాస్ కు ఎంతమంది స్టూడెంట్లుండాలి లాంటివేమీ చెప్పలేదు. రీ ఓపెనింగ్ కు ఇంకా రెండు రోజులే టైం ఉండటంతో గైడ్ లైన్స్ లేక స్కూళ్లు,థర్డ్ వేవ్ టెన్షన్ లో పిల్లల్ని పంపాలా వద్దా అని తల్లిదండ్రులు కన్ఫ్యూజ్ అవుతున్నారు గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. సెప్టెంబర్ 1న ఫిజికల్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఈ నెల 23న ప్రకటించారు. శానిటైజేషన్, క్లీనింగ్ గురించి చెప్పారు. కానీ స్కూళ్ల నిర్వహణ గురించి మాత్రం సర్కారు ఇంకా ఆదేశాలివ్వలేదు. వారంలో ఎన్ని రోజులు స్కూల్ నడపాలి, క్లాస్‌‌కు ఎంతమంది స్టూడెంట్స్ ఉండాలి, బెంచ్‌‌కు ఎంత మందిని కూర్చోబెట్టాలి, రోజు విడిచి రోజు ఫిజికల్‌‌ క్లాసులా, రోజూ నడపాలా, ప్రైమరీ పిల్లల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి లాంటి ప్రశ్నలు యాజమాన్యాలను వెంటాడుతున్నాయి. సర్కారు గైడ్ లైన్స్ లేకపోవడంతో కొన్ని స్కూళ్లు పాత పద్ధతినే పాటించాలని భావిస్తున్నాయి. మరికొన్ని స్కూళ్లు సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాయి. 

క్లారిటీ లేదంటున్న స్కూల్‌‌ మేనేజ్‌‌మెంట్లు

గతంలో క్లాస్‌‌కు 20 మందే స్టూడెంట్స్ ఉండాలని, బెంచీకి ఒకరే ఉండాలని గైడ్ లైన్స్ ఉన్నాయి. అప్పుడు పేరెంట్స్ అనుమతితోనే పిల్లలను రప్పించాలని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడేమో సర్కారు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. మరోవైపు డీఈవో నుంచి గైడ్ లైన్స్ వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. క్లాస్‌‌కు 16 మంది స్టూడెంట్స్‌‌ ఉండాలని అందులో ఉంది. వాటిపైనా తమకు క్లారిటీ లేదని స్కూళ్ల మేనేజ్‌‌మెంట్లు చెబుతున్నాయి. కొన్ని స్కూళ్లు పిల్లల్ని కచ్చితంగా పంపాలని, ఆన్‌‌లైన్‌‌ క్లాసులుండవని చెబుతున్నాయి. గవర్నమెంట్ నుంచి స్కూళ్ల నిర్వహణపై గైడ్ లైన్స్ తెలిస్తే పంపాలా వద్దా ఆలోచిస్తామని పేరెంట్స్‌‌ అంటున్నారు. 

ఆన్​లైన్​, ఆఫ్​లైన్‌‌ రెండూ నడిపిస్తం: స్లేట్‌‌ స్కూల్స్‌‌ 

థర్డ్ వేవ్‌‌లో పిల్లలకు కరోనా సోకే ప్రమాదముందని అందరూ భయపడుతున్నారు. పిల్లలు స్కూల్‌‌కు వెళ్తే వాళ్లకు, వాళ్ల నుంచి ఇంట్లోళ్లకు  కరోనా వచ్చే ప్రమాదం ఉందని అన్నారు. పదేళ్లలోపు పిల్లల్లో వైరస్‌‌ను తట్టుకోగలిగే శక్తి ఉంటుందని, ఇంగ్లాండ్‌‌లో ప్రైమరీ స్కూళ్లను ముందే ఓపెన్ చేశారని స్లేట్ స్కూల్స్ డైరెక్టర్ వాసిరెడ్డి అమర్‌‌నాథ్ తెలిపారు. ప్రస్తుతం తల్లిదండ్రులు వాక్సిన్‌‌ వేయించు కున్నారని, దాదాపు 2 లక్షల మంది టీచర్లూ టీకాలేసుకున్నారని చెప్పారు. తామూ గైడ్ లైన్స్ పాటిస్తూ జాగ్రత్తలతో స్కూల్స్ రన్ చేస్తామన్నారు. పేరెంట్స్‌‌కు కరోనా భయం ఉంటే ఫిజికల్ క్లాసులతో పాటు ఆన్‌‌లైన్‌‌ క్లాసులూ కంటిన్యూ చేస్తామని తెలిపారు. రెగ్యులర్‌‌ క్లాస్‌‌తో పోలిస్తే సగం మంది స్టూడెంట్లతోనే క్లాస్‌‌ నడిపిస్తామన్నారు.  

బడుల ప్రారంభంపై హైకోర్టులో పిల్

వచ్చే నెల ఒకటి నుంచి స్కూళ్లను ఓపెన్ చేయాలని రాష్ట్ర సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిల్ ఫైల్ అయింది. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ హైదరాబాద్‌‌కు చెందిన ప్రైవేట్‌‌ టీచర్ ఎం.బాలకృష్ణ పిల్ వేశారు. విద్యాశాఖ సెక్రటరీ, స్కూల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్, పబ్లిక్‌‌ హెల్త్‌‌ డైరెక్టర్, కొవిడ్ నిపుణుల కమిటీలోని డాక్టర్లను ప్రతివాదులుగా చేర్చారు. పిల్లలపై థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే రిపోర్టులు ఉన్నాయని, దేశంలో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు. ఇలాంటి టైమ్ లో స్కూళ్లను ఓపెన్ చేస్తే కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. ఆన్ లైన్ క్లాసులనే కొనసాగించాలని కోరారు. ఈ పిల్ ను ఈ నెల 31న కోర్టు విచారించనుంది.కచ్చితంగా పంపాలన్నారు మా బాబు పదో తరగతి చదువుతున్నాడు. సెప్టెంబర్ ఒకటి నుంచి స్కూల్స్‌‌ రీ ఓపెన్ అవుతాయన్న తర్వాత మేనేజ్‌‌మెంట్‌‌ నుంచి మాకు కాల్‌‌ వచ్చింది. బాబును కచ్చితంగా స్కూల్‌‌కు పంపాలన్నారు. కానీ ప్రభుత్వం కచ్చితంగా పంపాలా వద్దా అని గైడ్‌‌లైన్స్‌‌ ఏం ఇవ్వలేదు. పైగా థర్డ్‌‌ వేవ్‌‌ టెన్షన్‌‌ కూడా ఉంది. నెల రోజులు నడిపి స్కూళ్లు బంద్‌‌ చేస్తారేమోనని డౌట్‌‌ కూడా ఉంది. ఆన్‌‌లైన్‌‌లోనేమో పిల్లలకు చదువు రావట్లేదు. 
- మనోజ్ కుమార్ 
(పేరెంట్, సికింద్రాబాద్)

ఆప్షన్ ఇస్తున్నాం

మాకు అఫీషియల్ అనౌన్స్‌‌మెంట్‌‌ లేదు. కానీ రీ ఓపెనింగ్‌‌కు ఏర్పాట్లు చేశాం. తల్లిదండ్రులతో రోజూ మాట్లాడుతున్నాం. 35 శాతం మంది పేరెంట్స్ పంపడానికి రెడీగా ఉన్నారు. 20 నుంచి 25 శాతం మంది వారం చూశాక పంపిస్తామంటున్నారు. ఇంకో 40 శాతం మంది ఆన్‌‌లైన్‌‌ క్లాసులే చెప్పాలన్నారు. మేం కూడా వాళ్ల ఇష్టప్రకారం ఆన్‌‌లైన్‌‌, ఆఫ్‌‌లైన్‌‌ క్లాసులు చెప్తామని చెప్పాం. క్లాస్‌‌లో 20 మంది స్టూడెంట్స్, బెంచీకి ఒకరుండేలా ఏర్పాట్లు చేస్తున్నాం.  
- వాసిరెడ్డి అమర్‌‌నాథ్ (డైరెక్టర్, స్లేట్ స్కూల్స్) 

క్లాస్‌‌కు 16 మంది ఉండాలన్నరు

క్లాస్‌‌లో 16 మంది స్టూడెంట్స్ ఉండేలా చూసుకోవాలని డీఈవో నుంచి ఇన్‌‌స్ట్రక్షన్స్ వచ్చాయి. పిల్లలు ఎక్కువుంటే సెక్షన్లుగా విడగొట్టాలని చెప్పారు. క్లాస్‌‌కు 30 నుంచి 40 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లను ఎలా విభజించాలో  అర్థం కావట్లేదు. 
- శారద (హెచ్ఎం, గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్, మాసబ్ ట్యాంక్)