జాతీయ అత్యవసర పరిస్థితుల్లో దేశీయ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వానికి హక్కు

జాతీయ అత్యవసర పరిస్థితుల్లో దేశీయ క్రూడాయిల్‌‌‌‌‌‌‌‌పై ప్రభుత్వానికి హక్కు
  • భారత్‌‌‌‌‌‌‌‌లో ఉత్పత్తి అయిన నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌పై కూడా
  • మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు వీలు
  • ఆయిల్​ ఫీల్డ్స్‌‌‌‌‌‌‌‌ (సవరణ) చట్టంలో డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ రూల్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: జాతీయ అత్యవసర పరిస్థితుల్లో దేశంలో ఉత్పత్తి అయ్యే ఆయిల్, నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌లపై ప్రభుత్వం ప్రీ-ఎంప్షన్ హక్కులను కలిగి ఉంటుందని ఆయిల్‌‌‌‌‌‌‌‌ఫీల్డ్స్ చట్టం కింద రూపొందిస్తున్న డ్రాఫ్ట్ రూల్స్ చెబుతున్నాయి. ప్రీ-ఎంప్షన్ హక్కు కింద ఒక ప్రొడక్ట్, ఆస్తి లేదా రిసోర్స్‌‌‌‌‌‌‌‌ను ఇతరులకు అమ్మినా, తిరిగి  కొనుగోలు చేయొచ్చు  లేదా దక్కించుకోవచ్చు.   క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్‌పై ఇలాంటి హక్కులను చేర్చడం ద్వారా అత్యవసర సమయాల్లో ప్రజల బాగోగులను, భద్రతను చూడడానికి ప్రభుత్వానికి వీలుంటుంది.  ఆయిల్, నేచురల్ గ్యాస్ ఉత్పత్తిదారుడికి "ప్రీ-ఎంప్షన్ సమయంలో ఉన్న  మార్కెట్ ధరను" చెల్లించాలని  డ్రాఫ్ట్ రూల్స్‌‌‌‌‌‌‌‌లో ఉంది.  పెట్రోలియం, నేచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ఈ డ్రాఫ్ట్ రూల్స్‌‌‌‌‌‌‌‌పై ఫీడ్‌‌‌‌‌‌‌‌బ్యాక్‌‌‌‌‌‌‌‌ ఆహ్వానించింది.

"పెట్రోలియం ఉత్పత్తులు లేదా మినరల్ ఆయిల్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు  లీజుకిచ్చిన  ఏరియా నుంచి తీసిన క్రూడ్ ఆయిల్ లేదా నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌పై ప్రీఎంప్షన్ హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.  అంటే వీటి నుంచి ఉత్పత్తి చేసిన మినరల్ ఆయిల్స్, రిఫైన్డ్ పెట్రోలియం లేదా పెట్రోలియం ఉత్పత్తులు, లేదా  దేశంలో రిఫైన్ చేయకుండా సేల్, ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్ లేదా డిస్పోజ్ చేయడానికి అనుమతించిన క్రూడ్ ఆయిల్ లేదా నేచురల్ గ్యాస్‌‌‌‌‌‌‌‌పై కూడా ప్రీ-ఎంప్షన్ హక్కు దక్కుతుంది" అని డ్రాఫ్ట్‌‌‌‌‌‌‌‌ రూల్స్ చెబుతున్నాయి.

అయితే, జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటో  నిర్వచించలేదు. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం, యుద్ధం లేదా పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌తో జరిగిన మిలిటరీ స్టాండ్‌‌‌‌‌‌‌‌ ఆఫ్ వంటి యుద్ధ సమాన పరిస్థితులు, లేదా ప్రకృతి విపత్తులు జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించొచ్చు. "మినరల్ ఆయిల్స్‌‌‌‌‌‌‌‌కు సంబంధించి జాతీయ అత్యవసర పరిస్థితి ఏంటనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.  ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌‌‌‌‌‌‌‌" అని రూల్స్‌‌‌‌‌‌‌‌  చెబుతున్నాయి.