గతేడాది పెట్టిన స్కీంలు, నిధులు వదిలేయాలని డిపార్ట్ మెంట్లకు సర్కారు సూచనలు

గతేడాది పెట్టిన స్కీంలు, నిధులు వదిలేయాలని డిపార్ట్ మెంట్లకు సర్కారు సూచనలు

హైదరాబాద్, వెలుగు :  ‘‘పోయిన ఏడాదికి సంబంధించి ఏదీ ముట్టుకోవద్దు.  అంతా ఈ ఆర్థిక సంవత్సరాన్ని మాత్రమే లెక్కలకు తీసుకోవాలె” అని రాష్ట్ర ప్రభుత్వం అన్ని డిపార్ట్​మెంట్లకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వివిధ సంక్షేమ పథకాలకు గత సంవత్సరం చేసిన నిధుల కేటాయింపులు, లబ్ధిదారుల విషయాలు చర్చకు రాకుండా ఈసారి టార్గెట్​ ఏమిటన్న దానిపైనే ఫోకస్​ పెట్టాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

దీంతో 2022-–23 ఆర్థిక సంవత్సరంలో సర్కారు ఆర్భాటంగా ప్రకటించిన కొన్ని పథకాలు అసలు అమలు కాకుండానే అటకెక్కాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈసారి ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్​లోనూ కిందటేడాది ప్రకటించిన పథకాలనే అంతే సంఖ్యలో లబ్ధిదారులకు అందజేస్తామని బీఆర్ఎస్​ ప్రభుత్వం ప్రకటించింది. ఆయా స్కీముల ద్వారా లబ్ధి పొందే వారి సంఖ్య డబుల్​ అవుతుందని అంతా ఆశించారు.

కానీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. పోయినేడాది ఇచ్చిన బడ్జెట్​ రిలీజ్​ ఆర్డర్లు, నిధుల కేటాయింపులన్నీ పక్కన పడేయాలని అన్ని డిపార్ట్​మెంట్లకు నిర్దేశించినట్లు  తెలుస్తోంది. ప్రభుత్వం ఈసారి (2023‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–24)  వివిధ స్కీంల కింద రూ.70 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా..  రూ.35 వేల కోట్లు ఖర్చుచేయకుండా తెలివిగా తప్పించుకుంటున్నదని అధికార వర్గాలే చెబుతున్నాయి.

కిందటేడాది, ఈ ఆర్థిక సంవత్సరం కలుపుకొని దళిత బంధు, సొంత జాగా ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం, రుణమాఫీ సహా పలు సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 15 లక్షల మందికి లబ్ధి చేకూర్చాల్సి ఉంది. సర్కారు యూటర్న్​ తీసుకోవడంతో సగం మందికే సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరే పరిస్థితి ఏర్పడింది.  

రుణమాఫీ లేదు.. ఇండ్లకూ సాయం లేదు

సొంత జాగా ఉన్న పేదలకు ఇండ్లు కట్టుకునేందుకు సాయం అందించే విషయంలోనూ ప్రభుత్వం అలాగే ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. పోయిన ఏడాది రాష్ట్రంలో 4 లక్షల మందికి ఈ స్కీంను వర్తింపజేయాలని నిర్ణయించారు. ఈసారీ అంతే స్థాయిలో అనుకున్నారు. ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి రూ.3 లక్షలు చొప్పున 40 వేల మందికి సాయం అందజేయడం ఈ స్కీం లక్ష్యం.

అప్పుడు ఈ పథకం బడ్జెట్​ రూ.12 వేల కోట్లు ఉండగా.. ఈసారీ అంతే అమౌంట్​ను కేటాయించారు. ఈ ఆర్థిక సంవత్సరం కలుపుకొని మొత్తం 6 వేల మందికి అందాల్సిన ఈ పథకాన్ని.. మూడువేల మందికే పరిమితం చేయాలని నిర్ణయించారు. ఫలితంగా ఈ పథకంలో రూ.12 వేల కోట్లు ఖర్చుచేయకుండా మిగిల్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

రుణమాఫీకి సంబంధించి గత సంవత్సరం రూ.75 వేలలోపు ఉన్న పంట రుణాల మాఫీకి రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించింది. ఈసారి కూడా అంతే మొత్తాన్ని బడ్జెట్ లో పెట్టారు. దీంతో ఇందులోనూ కొత్త లబ్ధిదారులెవరూ ఉండే అవకాశం లేదు.

1,500 మందికే దళిత బంధు

నిధుల లేమితో స్కీంలు అమలు చేయలేని పరిస్థితి ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం.. తెలివిగా అవే పథకాలు, అంతే బడ్జెట్​ కేటాయింపులు, అదే స్థాయిలో లబ్ధిదారుల సంఖ్యను  ఈ బడ్జెట్​లో చూపించింది. దళితబంధు కింద 2022–23లో 1,500 మంది లబ్ధిదారులకు రూ.17,700 కోట్లు కేటాయించింది. ఈ లెక్కన దళితబంధు స్కీంకు గతేడాది, ఈ ఏడాది కలుపుకొని మొత్తం 3 వేల మందికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది.

గత ఏడాది 1,500 మంది అప్లికేషన్ల విషయం మర్చిపోవాలని.. ఈసారి లిస్టులో పెట్టుకున్నవే పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నదని సమా చారం. దీంతో ప్రభుత్వానికి ఈ స్కీంలోనే 17,700 కోట్లు మిగిలాయని తెలుస్తోంది.