మొదలైన కోడియాక్ డెలివరీలు.. ఎక్స్​షోరూం ధర రూ.46.89 లక్షలు..

మొదలైన కోడియాక్ డెలివరీలు.. ఎక్స్​షోరూం ధర రూ.46.89 లక్షలు..

హైదరాబాద్, వెలుగు: మహావీర్ గ్రూప్కు చెందిన స్కోడా డీలర్‌‌‌‌‌‌‌‌ మహావీర్ స్కోడా, తెలుగు రాష్ట్రాలకు సరికొత్త స్కోడా కోడియాక్  కస్టమర్ డెలివరీలను సోమవారం ప్రారంభించింది. సెకండ్ ​జెనరేషన్​ కోడియాక్​లో 2.0 లీటర్​ ఇంజన్ ​ఉంటుంది. ఇది 204 పీఎస్ ​పవర్​ను, 320 ఎన్​ఎం టార్క్​ను ఇస్తుంది. లీటరుకు 14.86 కిలోమీటర్ల మైలేజ్​ఇస్తుంది. ఇన్ఫోటైన్‌‌‌‌‌‌‌‌మెంట్ సిస్టమ్, స్మార్ట్ డయల్స్, ఎర్గో మసాజ్ సీట్లు, కాంటన్ 13-స్పీకర్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్‌‌‌‌‌‌‌‌రూఫ్, 9 ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌లు  1,976 లీటర్ల వరకు లగేజ్ స్పేస్ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. ఎక్స్​షోరూం ధర రూ.46.89 లక్షలు.