కంటి వెలుగు ఫస్ట్ ఫేజ్ వారికి నేటికీ తప్పని ఎదురుచూపులు

కంటి వెలుగు ఫస్ట్ ఫేజ్ వారికి నేటికీ తప్పని ఎదురుచూపులు
  •     సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 66  వేల మంది వెయిటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  •     జనవరి 18 నుంచి రెండో విడత ప్రారంభానికి ఏర్పాట్లు

సూర్యాపేట/యాదాద్రి, వెలుగు : ‘కంటి వెలుగు’ రెండో విడత కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం మొదటి విడతలో గుర్తించిన వారికి నేటికీ ఆపరేషన్లు చేయించలేదు. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో సుమారు 60 వేల మందికి ఆపరేషన్లు చేయిస్తామని చెప్పిన సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనీసం 600 మందికి కూడా చేయించలేకపోయింది. ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు ప్రారంభిస్తామని చెబుతుండడంతో ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో గుర్తించిన మా పరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రెండు జిల్లాల్లో కలిపి 236 మందికే ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కంటి వెలుగు ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా సూర్యాపేట జిల్లాలో 26 టీంలు 5,76,031 మందికి టెస్టులు చేశారు. ఇందులో 1.04 లక్షల మందికి అద్దాలు పంపిణీ చేయగా, మరో 50,425 మందికి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరమని గుర్తించారు. ఇందులో కేవలం 236 మందికి మాత్రమే ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించి చేతులు దులుపుకున్నారు. అలాగే యాదాద్రి జిల్లాలో 17 టీంలు 3.12 లక్షల మందిని పరీక్షించారు. ఇందులో 46,147 మందికి రీడింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్లాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 30,930 మందికి అద్దాలు అందజేశారు.

16,634 మందికి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయాలని సిఫార్సు చేశారు. వీరికి కంటి ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం కోసం సిద్ధం చేస్తున్న టైంలో వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కొందరు కంటి చూపు కోల్పోవడంతో వెంటనే ఇక్కడ కూడా ఆపరేషన్లు నిలిపివేశారు. ఆ తర్వాత ఒక్కరికి కూడా ఆపరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు. దీంతో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో సుమారు 66 వేల మంది కంటి ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వీరికి ఆపరేషన్లు ఎప్పుడు చేయిస్తారు.. అసలు చేయిస్తారా? లేదా అన్న విషయం ఆఫీసర్లకే క్లారిటీ లేకుండా పోయింది. 

సెకండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కసరత్తు

జనవరి 18 నుంచి ప్రభుత్వం రెండో విడత కంటి వెలుగును ప్రారంభించనుంది. ఇందుకోసం సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో ఆఫీసర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో 7.50 లక్షల మందికి టెస్టులు చేసేందుకు 8 టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఓ వైపు సిబ్బంది కొరత వేధిస్తుండగా, మరో వైపు కంటి పరీక్షల మెషీన్లు రిపేర్లలో ఉన్నాయి. జిల్లాకు చెందిన 16 మెషీన్లను రిపేర్ల కోసం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పంపించారు.

అలాగే యాదాద్రి జిల్లాలో కంటి పరీక్షలు నిర్వహించేందుకు 31 టీంలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈ సారి కంటి పరీక్షలు చేయించుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరీక్షలకు మూడు నెలల టైం కావాలని హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు కోరారు. జిల్లాలో గతంలో వాడిన 8 మెషీన్లలో ప్రస్తుతం 3 రిపేర్లలో ఉన్నాయి. ఫస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గైడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధారంగానే రెండో విడతలో కూడా కంటి పరీక్షలు నిర్వహిస్తామని ఆఫీసర్లు చెప్పారు.