ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య బృందం తనిఖీలు

ప్రైవేట్ ఆస్పత్రులపై వైద్య బృందం తనిఖీలు

వేలకు వేలు డబ్బులు గుంజుతూ పేదల రక్తాన్ని జలగల్లా తాగుతున్నారు కొందరు కంత్రీగాళ్లు. వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా కొందరు డాక్టర్ల ప్రవర్తన చూస్తుంటే ఎవ్వరైనా విస్తుపోవాల్సిందే. వైద్యో నారాయణ హరి అంటారు..వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. కానీ కొందరు కాసుల కక్కుర్తితో పేదల జీవితాలతో చెలగాటం ఆడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని  ప్రైవేట్ ఆసుపత్రులపై  ప్రభుత్వ వైద్య బృందం తనిఖీలు నిర్వహించింది. సరైన వసతులు, అర్హతలేని డాక్టర్స్ తో వైద్యం నిర్వహిస్తున్న పలు క్లినిక్ లకు నోటీసులు ఇవ్వగా..మరికొన్నింటిని సీజ్ చేశారు. రోగులకు మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించడంలో ఇబ్రహీంపట్నంలోని జయ హాస్పిటల్ను  డాక్టర్ అభిరామ్ బృందం సీజ్ చేసింది.జయ ఆసుపత్రిలో కాలం చెల్లిన పరికరాలు ఉన్నాయని, వాటికి ఏలాంటి అనుమతులు లేవని  వైద్య బృందం తేల్చింది. 

మంచాల మండలం నోములలోని ఓ క్లినిక్ కు సరైన పత్రాలు లేవని ప్రైవేటు హాస్పిటల్ ను అధికారులు సీజ్ చేశారు. తనిఖీ నిర్వహిస్తున్న డాక్టర్ అభిరామ్ తో ఆస్పత్రి యాజమాన్యం జయప్రకాష్ వాగ్వాదానికి దిగారు. అధికారులతో దురుసుగా ప్రవర్తించాడు. ఇప్పటికే 7హాస్పిటల్స్ లో తనిఖీలు నిర్వహించి నోటీసులు ఇచ్చామని.., ఇంకా నాలుగు రోజులపాటు ఈ సోదాలు కొనసాగుతాయని వైద్య బృందం తెలిపింది. నియోజకవర్గ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్న నేపథ్యంలో ఫేక్ డాక్టర్స్ హాస్పిటల్స్ ను మూసివేసి పారిపోతున్నారు.