ఏపీలో 26 జిల్లాలు.. సర్కార్ ఆదేశాలు జారీ

ఏపీలో 26 జిల్లాలు.. సర్కార్ ఆదేశాలు జారీ

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాలో వచ్చాయి. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల సంఖ్యను 26కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 13 జిల్లాలకు అదనంగా మరో 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది జగన్ సర్కార్. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కొత్త జిల్లాలకు కావల్సిన మ్యాప్ సిద్ధమైంది. రాష్ట్రంలో జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణకు సంబంధించి ప్రతిపాదనలను రెడీ చేసింది. ఈ మేరకు 26 కొత్త జిల్లాల ప్రతిపాదనల రిపోర్టును ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్‌కుమార్‌ సీఎస్‌కు అందించారు. దీంతో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే ఉగాదిలోపు పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తిచేసి కొత్త జిల్లాలను అమల్లోకి తెచ్చేలా ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. పరిపాలనా సౌలభ్యం కోసం ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటుచేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.