సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ బడులు

సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ బడులు

షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ బడులు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా సోలిపూర్ గవర్నమెంట్​ ప్రైమరీ స్కూల్​లోని పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. స్కూల్ బిల్డింగ్ ​శిథిలావస్థకు చేరింది. తలుపులు, కిటికీలు విరిగిపోయాయి. కనీసం తాగునీటి సౌకర్యం లేదు. టాయిలెట్లలో చెత్తాచెదారం చేరి కంపు కొడుతున్నాయి. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో సుమారు 60 మంది పిల్లలు చదువుకుంటున్నారు.

అయితే వీరికి మూడు తరగతి గదులే ఉన్నాయి. దీంతో 4, 5వ తరగతులను స్టాఫ్ రూమ్ లో కొనసాగిస్తున్నారు. పిల్లలు ఇంటి దగ్గర నుంచే బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇంత ఇంత దయనీయంగా ఉన్నా ఉన్నతాధికారులు మాత్రం పట్టించుకోవడంలేదు. మన ఊరు – మన బడి కార్యక్రమంలోనైనా స్కూలును బాగుచేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు కోరుతున్నారు.  గతంలో గ్రామ పంచాయతీగా ఉన్న ఈ గ్రామం ప్రస్తుతం మున్సిపాలిటీ పరిధిలోకి రావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.