చిప్‌ల తయారి కంపెనీలకు 76 వేల కోట్ల రాయితీలు

చిప్‌ల తయారి కంపెనీలకు 76 వేల కోట్ల రాయితీలు

న్యూఢిల్లీ : దేశాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌‌‌‌గా మార్చడంపై ప్రభుత్వం సీరియస్‌‌గా ఉందనే విషయం మరోసారి రుజువయ్యింది. దేశంలో సెమికండక్టర్ల (చిప్‌‌) తయారీ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో రూ. 76 వేల కోట్లను రాయితీలుగా ఇవ్వనుంది.  అంతేకాకుండా ‘చిప్స్‌‌ టూ స్టార్టప్స్’ ప్రోగ్రామ్‌‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో భాగంగా  85 వేల మంది ఇంజినీర్లకు ట్రెయినింగ్ ఇస్తారు. ‘దేశంలో సెమీకండక్టర్ల తయారీ ప్లాంట్లను పెట్టే కంపెనీలకు వచ్చే ఆరేళ్లలో రూ. 76 వేల కోట్ల విలువైన రాయితీలను ఇచ్చేందుకు కేంద్రం కేబినేట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఈ స్కీమ్‌‌ కింద  20 సెమీ కండక్టర్ల డిజైన్‌‌,  కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేయడమే టార్గెట్‌‌గా పెట్టుకున్నాం’ అని కేంద్ర టెలికం అండ్‌‌ ఐటీ మినిస్టర్‌‌ అశ్విని వైష్ణవ్‌‌ అన్నారు. ‌‌   ప్రభుత్వం కేవలం పెద్ద కంపెనీలకే కాకుండా స్టార్టప్‌‌లను ఎంకరేజ్‌‌ చేయాలని చూస్తోంది. అప్లికేషన్లను పిలవడంపై  ఎలక్ట్రానిక్స్‌‌ మినిస్ట్రీ  పనిచేస్తుంది.  ఈ స్కీమ్‌‌కు  ‘డెవలప్‌‌మెంట్‌‌ఆఫ్‌‌ సెమికండక్టర్స్‌‌ అండ్‌‌ డిస్‌‌ప్లే మాన్యుఫాక్చరింగ్‌‌ ఎకోసిస్టమ్‌‌ ఇండియా’ అనే పేరును ప్రభుత్వం పెట్టింది. ఈ స్కీమ్‌‌ కింద మరో ఐదారేళ్లలో రూ. 1.7 లక్షల కోట్ల విలువైన ఇన్వెస్ట్‌‌మెంట్స్ వస్తాయని  అంచనా. డిస్‌‌ప్లే ఫ్యాబ్రికేషన్ సెగ్మెంట్‌‌, కాంపోనెంట్ల డిజైనింగ్‌‌, ప్రొడక్షన్ సెగ్మెంట్‌‌లో ప్లాంట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. 

కొత్తగా డీఎల్‌‌ఐ స్కీమ్‌‌..
2025 నాటికి దేశ డిజిటల్ ఎకానమీ రూ. 76 లక్షల కోట్ల (ట్రిలియన్ డాలర్ల) కు, జీడీపీ రూ. 380 లక్షల కోట్ల (5 ట్రిలియన్ డాలర్లకు) చేరడంలో తాజాగా తీసుకున్న నిర్ణయం సాయపడుతుందని  ప్రభుత్వం భావిస్తోంది. ‘ఈ స్కీమ్‌‌ కింద  85 వేల మంది సెమీకండక్టర్ ఇంజినీర్లను ట్రైనింగ్ చేయనున్నాం. డిజైన్‌‌, ఫ్యాబ్రికేషన్‌‌, టెస్టింగ్,  ప్యాకేజింగ్ వంటి సెగ్మెంట్లను కూడా కలుపుకొని ‘చిప్స్‌‌ టూ స్టార్టప్స్‌‌’ ప్రోగ్రామ్‌‌ కింద ట్రెయినింగ్ ఇస్తాం.  కొత్తగా డిజైన్‌‌ లింక్డ్‌‌ ఇన్సెంటివ్‌‌ (డీఎల్‌‌ఐ) స్కీమ్‌‌ను తీసుకొస్తున్నాం. ఈ స్కీమ్‌‌ కింద  కంపెనీలు భరించే ఖర్చులో 50 శాతాన్ని ప్రభుత్వం భరిస్తుంది’ అని టెలికం అండ్ ఐటీ మినిస్టర్‌‌‌‌  అశ్విని వైష్ణవ్‌‌ అన్నారు. సెమికండక్టర్ల సెగ్మెంట్‌‌లో  పీఎల్‌‌ఐ స్కీమ్ వలన  35 వేల హై క్వాలిటీ జాబ్స్ క్రియేట్ అవుతాయని, ఇన్‌‌డైరెక్ట్‌‌గా లక్ష జాబ్‌‌లు వస్తాయని ఆయన పేర్కొన్నారు. 

కంపెనీల నుంచి ఆసక్తి..
 దేశంలో చిప్‌‌ల తయారీప్లాంట్లను ఏర్పాటు చేయడానికి  ఇప్పటికే కొన్ని కంపెనీలు ముందుకొచ్చాయి. ఇజ్రాయిల్‌‌కు చెందిన టవర్‌‌‌‌ సెమికండక్టర్స్‌‌, యాపిల్ కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌‌‌‌  ఫాక్స్‌‌కాన్‌‌, సింగపూర్‌‌‌‌కు చెందిన ఒక కన్సార్షియం  దేశంలో సెమికండక్టర్ల ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపించాయి. వేదాంత గ్రూప్‌‌ కూడా ఈ సెక్టార్‌‌‌‌లో ఎంటర్ అవ్వాలని చూస్తోంది. సెమికండక్టర్ల బిజినెస్‌‌లో ఎంటర్ అవ్వడానికి ఇంటర్నేషనల్ కంపెనీలతో పార్టనర్‌‌‌‌షిప్‌‌ కుదుర్చుకోవాలని టాటా గ్రూప్ చూస్తోంది. కేంద్రం కూడా తైవాన్‌‌ సెమికండక్టర్‌‌‌‌ మాన్యుఫాక్చరింగ్‌‌ కంపెనీ (టీఎస్‌‌ఎంసీ), యూనిటైడ్‌‌ మైక్రోఎలక్ట్రానిక్స్‌‌ (యూఎంసీ) వంటి కంపెనీలను ఇండియాకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  టీఎస్‌‌ఎంసీ వంటి కంపెనీలు చిప్‌‌ల డిజైన్‌‌ను, మాన్యుఫాక్చరింగ్‌‌ను చేపడతాయి. శామ్‌‌సంగ్‌‌, క్వాల్‌‌కమ్‌‌ వంటి కంపెనీలు వీటిని టెస్ట్ చేసి, ప్యాక్ చేసి సిస్కో సిస్టమ్స్‌‌, షావోమి వంటి గ్యాడ్జెట్ తయారీ కంపెనీలకు సేల్ చేస్తాయి. కాగా, చిప్‌‌ల కొరతతో ఆటో ఇండస్ట్రీ నుంచి అనేక సెక్టార్లలోని కంపెనీలు ఇబ్బందిపడుతున్నాయి. కార్ల నుంచి ఫోన్లు,  టీవీలు, ల్యాప్‌‌టాప్‌‌లు, వాషింగ్ మెషిన్లు వంటి డైలీగా వాడుకునే ప్రొడక్టుల వరకు అన్నింటికి  చిప్‌‌ల అవసరం ఉంటుంది.

యూపీఐ, రూపే కార్డు ట్రాన్సాక్షన్లపై రాయితీ.. 
యూపీఐ, రూపే డెబిట్‌‌‌‌‌‌ కార్డుల ద్వారా డిజిటల్‌‌‌‌ ట్రాన్సాక్షన్లను పెంచేందుకు  రూ. 1,300 కోట్ల ఇన్సెంటివ్ స్కీమ్‌‌‌‌కు కేంద్ర కేబినేట్‌‌‌‌ ఆమోదం తెలిపింది. మర్చంట్లకు చేసే ట్రాన్సాక్షన్లపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (ఎండీఆర్‌‌‌‌‌‌‌‌) కింద వేసే ఛార్జీలను ప్రభుత్వం రియంబర్స్ చేస్తుందని ఐటీ, ఎలక్ట్రానిక్స్ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అశ్విని వైష్ణవ్ అన్నారు. ఈ స్కీమ్‌‌‌‌ను ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌ 1 నుంచి పరిగణనలోకి తీసుకుంటారు. ఈ ఏడాది నవంబర్‌‌‌‌‌‌‌‌లో 423 కోట్ల డిజిటల్‌‌‌‌ ట్రాన్సాక్షన్లు జరిగాయని, వీటి వాల్యూ రూ. 7.56 లక్షల కోట్లకు పెరిగిందని వైష్ణవ్‌‌‌‌ చెప్పారు. బీమ్‌‌‌‌–యూపీఐ, రూపే డెబిట్‌‌‌‌కార్డుల ద్వారా రూ. 2 వేల లోపు జరిగే ట్రాన్సాక్షన్లకు ప్రభుత్వం రియంబర్స్‌‌‌‌మెంట్‌‌‌‌ ఇస్తుంది. వ్యక్తుల నుంచి  వ్యాపారులకు జరిగే ట్రాన్సాక్షన్ల వాల్యూలో పర్సంటేజ్‌‌‌‌ కింద ప్రభుత్వం బ్యాంకులకు చెల్లిస్తుంది.

ఇథనాల్‌‌‌‌ సేల్ చేసినందుకు రూ. 18 వేల కోట్ల రెవెన్యూ
ఆయిల్‌‌ మార్కెటింగ్ కంపెనీలకు ఇథనాల్‌‌ను అమ్మడం ద్వారా 2021–22 లో  షుగర్‌‌‌‌ మిల్లులు, డిస్టిలరీ కంపెనీలుకు రూ. 18 వేల కోట్ల రెవెన్యూ వస్తుందని ఫుడ్‌‌ మినిస్ట్రీ అంచనావేసింది. లోక్‌‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ లెక్కలను ఫుడ్ అండ్ కన్జూమర్ అఫైర్స్‌‌ మినిస్టర్‌‌‌‌ సాధ్వీ నిరంజన్‌‌ జ్యోతి బయటపెట్టారు. 2018–19 ఇథనాల్ సప్లయ్ ఇయర్‌‌‌‌లో  షుగర్‌‌‌‌ మిల్లులు, డిస్టిలరీలు రూ. 8,079 కోట్ల రెవెన్యూని సాధించాయని, 2019–20 లో రూ. 7,823 కోట్లను, 2020–21 లో రూ. 13,598 కోట్లను సాధించాయని పేర్కొన్నారు.