వేములవాడ అభివృద్ధికి కృషి : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ అభివృద్ధికి కృషి : విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, వెలుగు: వెనుకబడిన వేములవాడ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. బుధవారం వేములవాడ పట్టణంలోని పలు వార్డుల్లో రూ.54 లక్షలతో సైడ్ డ్రైన్, సీసీ రోడ్లు,  సీసీ కల్వర్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గుడి చెరువులో, మూల వాగులో మురికి నీరు కలవకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. 

రాజన్న ఆలయాన్ని  అభివృద్ధి చేయడం తన పూర్వ జన్మసుకృతంగా భావిస్తున్ననట్లు చెప్పారు. అనంతరం పట్టణంలోని సుభాష్​నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. ఆయన మున్సిపల్​ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్వేశ్‌‌‌‌‌‌‌‌, మార్కెట్‌‌‌‌‌‌‌‌ కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌ రొండి రాజు, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌గౌడ్, రాజు, రాంబాబు, పాష పాల్గొన్నారు.