రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

 రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం :  ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
  • ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 

కోనరావుపేట,వెలుగు; రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని, కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం రామన్నపేట ధర్మారం గ్రామాల్లో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మంగళపల్లి గ్రామస్తుల చిరకాల కోరిక సుద్దాల క్రాస్ రోడ్ నుంచి  మంగళపల్లి గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి కోటి 30 లక్షలు, మల్కాపేటలో ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌బీ రోడ్డు నుంచి రామాలయానికి సీసీ రోడ్‌‌‌‌‌‌‌‌ నిర్మాణానికి రూ. 90 లక్షలు నిధులు మంజూరు చేశామన్నారు.  ఫ్యాక్స్ చైర్మన్లు సంకినేని రామ్మోహన్ రావు, బండ నరసయ్య, వైస్ చైర్మన్ మహేశ్ యాదవ్,పాలకవర్గ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

భూ సేకరణకు రూ. 6.98 కోట్ల మంజూరు 

వేములవాడ, వెలుగు: వేములవాడ, తిప్పాపూర్ వద్ద హై లెవెల్ బ్రిడ్జి భూసేకరణ నిమిత్తం ప్రభుత్వం రూ. 6  కోట్ల 98 లక్షల నిధులను మంజూరు చేసి కలెక్టర్ ఖాతాలో జమ చేసిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.