మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మహిళా అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : అడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల టౌన్, వెలుగు : మహిళా అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల్లో ఇచ్చినమాట నిలబెట్టుకుంటామని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో ఆదివారం జగిత్యాల జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "నారి న్యాయ సమ్మాన్ సమారోహ్​​" కార్యక్రమానికి  ప్రభుత్వ విప్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు అన్నిరంగాల్లో సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిందన్నారు. మహిళలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి మహిళలకు సర్టిఫికెట్లు, శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ సునీత, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మున్సిపల్ చైర్​పర్సన్ జ్యోతి, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి  శోభారాణి, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అనిత, మహిళలు పాల్గొన్నారు. 

పంటకు సాగునీరు అందేలా చర్యలు

గొల్లపల్లి, వెలుగు : రైతుల పంట పొలాలకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం గొల్లపల్లి మండల కేంద్రంలో కోటీ 19 లక్షల విలువైన కల్యాణలక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఆర్ఎస్పీ లో నీటిమట్టం తక్కువగా ఉండడంతో రైతులకు సాగునీరు అందించే విషయంలో కొంత సమస్య ఏర్పడిందన్నారు. సాగునీరు సరఫరాలో ఏర్పడుతున్న సమస్యను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ శంకరయ్య, సర్పంచ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిశాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ రావు, తహసీల్దార్ మహమ్మద్ జమీర్,  సర్పంచులు సత్యనారాయణ గౌడ్, గంగాధర్, రాజ్యలక్ష్మి, పద్మ పాల్గొన్నారు.