
తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ దత్తత గ్రామం కొండపర్తిలో బుధవారం గవర్నర్ సెక్రటరీ పవన్ సింగ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాలవికాస, తిరుపతి మేనేజర్ శౌరి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
గ్రామంలోని రైతులతో మాట్లాడారు. గ్రామంలో ఏమన్నా పెండింగ్ పనులు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. వారివెంట ఎంపీడీవో మనవాణి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.