భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

భద్రాద్రికి గవర్నర్ తమిళిసై

దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం సీతారామ ఆలయంలో  రేపు స్వామివారి కల్యాణోత్సవానికి అన్నీ ఏర్పాట్లు చేశారు అధికారులు. రేపు సీతారాముల కల్యాణం, ఎల్లుండి రామయ్య మహాపట్టాభిషేకం జరుగనున్నాయి. ఎల్లుండి జరిగే రాములవారి పట్టాభిషేకానికి గవర్నర్ తమిళిసై హాజరుకానున్నారు. కరోనా వల్ల రెండేళ్లుగా కల్యాణానికి భక్తులను అనుమతించలేదు. ఈసారి వైరస్ ఎఫెక్ట్ తగ్గడంతో కల్యాణానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు.అందుకు తగినట్లు ఏర్పాట్లు చేశారు.

సీతారాముల కల్యాణం కోసం మిథిలా స్టేడియంను విద్యుత్ దీపాలతో అందంగా తయారు చేశారు అధికారులు.స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తులకు చలువ పందిళ్లు,టెంట్ లు, కూలర్లు ,మంచినీరు ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణాన్ని చూసేలా ఎల్.ఈ.డి లు పెట్టారు. తలంబ్రాల కోసం 50 కౌంటర్లు,లడ్డూలకు 30 కౌంటర్లు సిద్ధం చేశారు. మొత్తం 170 క్వింటాళ్ల తలంబ్రాలు,2 లక్షల లడ్డూలు రెడీ చేశారు. బ్రహ్మోత్సవాలకు రెండు కోట్లతో పనులు పూర్తి చేశారు అధికారులు. 

2000 మంది పైగా పోలీసులతో భద్రత ర్పాటు చేశారు అధికారులు. 12 సెక్టార్ లు గా విబజించి .. 7 ప్రదేశాలలో పార్కింగ్ అరెంజ్ చేశారు. ఇద్దరు అడిషనల్ ఎస్పీ లతో పాటు 16 మంది డీఎస్పీలు , 54 మంది సీఐలు.. 270 మంది ఆఫీసర్స్ ఎప్పటికప్పుడు భద్రతను పర్యవేక్షించనున్నారు.