కొమురవెల్లి మలన్న స్వామిని దర్శించుకున్న గవర్నర్

కొమురవెల్లి మలన్న స్వామిని దర్శించుకున్న గవర్నర్

సిద్ధిపేట జిల్లాలో గవర్నర్ తమిళి సై పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లారు. ఆలయ అధికారులు గవర్నర్ కు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తర్వాత మల్లికార్జున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలు అందరూ ఆరోగ్యంగా.. సుఖసంతోషాలతో ఉండాలని కొమురవెల్లి మల్లన్నను కోరుకున్నట్లు ఆమె చెప్పారు. కొమురవెల్లికి రైల్వే కనెక్షన్ త్వరగా పూర్తయ్యేలా.. కేంద్ర రైల్వే శాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి త్వరగా పూర్తి చేయిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. 

అనంతరం.. తెలంగాణ వజ్రోత్సవాల సందర్భంగా.. బైరాన్ పల్లికి గవర్నర్ తమిళి సై చేరుకున్నారు. అక్కడ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తర్వాత వీరబైరాన్ పల్లిలో ఉన్న చారిత్రాత్మక బురుజును గవర్నర్ సందర్శించారు.