
హైదరాబాద్: మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబం బాగుంటుందన్నారు గవర్నర్ తమిళి సై సౌందర రాజన్. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఇందులో భాగంగా రాజ్ భవన్ లో పని చేసే 59 మంది మహిళలకు అల్లికలు,కుట్లు, చేతి వృత్తి పనుల శిక్షణను గవర్నర్ ప్రారంభించారు.