ఆర్టీసీ బిల్లుకు టైమ్ పడుతుంది : రాజ్ భవన్ వర్గాలు

ఆర్టీసీ బిల్లుకు టైమ్ పడుతుంది : రాజ్ భవన్ వర్గాలు

TSRTC విలీన  బిల్లును  ఆమోదించకపోవడంపై  రాజ్ భవన్ క్లారిటీ ఇచ్చింది. బిల్లు ఆమోదానికి సమయం పడుతోందని రాజ్ భవన్ ఓ ప్రెస్  నోట్ రిలీజ్ చేసింది. 2023 ఆగస్టు 02 మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం బిల్లును రాజ్ భవన్ కు పంపిదని, మరుసటిరోజే సమావేశాలు ప్రారంభం అయ్యాయని చెప్పింది. 

బిల్లును క్షుణంగా పరిశీలించి. లీగల్ సలహాలు తీసుకుని  నిర్ణయం తీసుకునేందుకు సమయం పడుతోందని వెల్లడించింది.   దీంతో ఆర్టీసీ విలీనంపై  సందిగ్థత నెలకొంది.  ఆదివారంతో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. ఈ లోపు గవర్నర్ TSRTC విలీన  బిల్లును  ఆమోదించకపోతే బిల్లుకు తాత్కాలిక  బ్రేక్  పడినట్లు అవుతోంది.  

కాగా ఇటీవల జరిగిన కేబినేట్ భేటీలో ఆర్టీసీని విలీనం చేస్తూ కేసీఆర్  సర్కార్  నిర్ణయం తీసుకుంది.  దీంతో ఇన్నిరోజులు ఒక యూనియన్ గా ఉన్న ఆర్టీసీ ఇకపై గవర్నమెంట్ లో ఓ డిపార్ట్ మెంట్ గా మారనుంది.  ఆర్టీసీకి ఉన్న అప్పులు, ఆస్తులు మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుంది.  

అయితే ఇదంతా జరగాలంటే కేబినేట్ నిర్ణయం మాత్రమే కాకుండా గవర్నర్ ఆమోదం తప్పనిసరి కావాలి. గవర్నర్ బిల్లును ఆమోదించకపోతే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు.