నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

నేడు ఢిల్లీకి గవర్నర్ తమిళిసై
  • రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రిని కలిసే చాన్స్ 

హైదరాబాద్, వెలుగు: గవర్నర్ తమిళిసై ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రస్తుతం చెన్నైలో ఉన్న ఆమె అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లనున్నట్లు తెలుస్తున్నది. ఈ పర్యట నలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాను కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా పరిణామాలను వారికి వివరించే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. రిపబ్లిక్​ డే వేడుకలు జరపకపోవడంపై కేంద్రానికి రిపోర్ట్ పంపినట్లు గవర్నర్ మీడియాకు తెలిపా రు. ప్రభుత్వం, రాజ్‌‌‌‌‌‌‌‌భవన్‌‌‌‌‌‌‌‌ మధ్య వివాదం నడుస్తుండగా, ఇటీవల బడ్జెట్‌‌‌‌‌‌‌‌కు గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదం తెలపకపోవడం, దీనిపై రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టుకు వెళ్లడం, తర్వాత ప్రభుత్వం వెనక్కి తగ్గి బడ్జెట్ సమావేశా లను గవర్నర్ స్పీచ్‌‌‌‌‌‌‌‌తో అసెంబ్లీని స్టార్ట్ చేసింది. ఈ పరిణామాలను కేంద్ర పెద్దలకు వివరించే అవకాశాలు కనపడుతున్నాయి.