2047 టార్గెట్ గా పథకాలు

2047 టార్గెట్ గా పథకాలు
  • పీఎం ఆవాస్ యోజనకు నిధులు 66 శాతం పెంపు
  • పేద ఖైదీలకు ఆర్థిక సాయం
  • అడవిబిడ్డలకు ప్రత్యేక కార్యక్రమం
  • డ్రైనేజీల క్లీనింగ్ కు వందశాతం మెషీన్ల వాడకం

న్యూఢిల్లీ: దేశంలోని పేద, బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఈ బడ్జెట్​లో పలు పథకాలను, కార్యక్రమాలను ప్రకటించారు. పేదలకు ఉచిత ఆహారధాన్యాలు, డ్రైనేజీల క్లీనింగ్ కు వంద శాతం మెషీన్​ల వాడకం, ప్రమాదంలో ఉన్న ఆదివాసీ, గిరిజన తెగల కోసం ప్రత్యేక కార్యక్రమం అమలు వంటివి ఇందులో ఉన్నా యి. ఇండియాను మరో 25 ఏండ్లలో అభివృద్ధి చెం దిన దేశంగా నిలబెట్టాలన్న లక్ష్యానికి అనుగుణంగా పథకాలను రూపొందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.కరోనా విపత్తు సమయంలో పీఎం గరీబ్‌‌‌‌‌‌‌‌ కల్యాణ్‌‌‌‌‌‌‌‌ అన్న యోజన కింద 80 కోట్ల మందికి ఉచితంగా ఆహారధాన్యాలను సరఫరా చేశామని, ఈ ఏడాది కూడా ఇది కొనసాగుతుందని వెల్లడించారు. ఇందుకోసం బడ్జెట్ లో రూ. 2 లక్షల కోట్లను కేటాయించారు. ఈ మొత్తం ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరించనుందని తెలిపారు. 

పీఎంఏవైకి రూ. 79 వేల కోట్లు  

ప్రధాన మంత్రి ఆవాస్ యోజనకు కేంద్ర బడ్జెట్​లో కేటాయింపులు భారీగా పెరిగాయి. పోయిన బడ్జెట్‌‌‌‌‌‌‌‌లోపీఎంఏవైకు రూ. 48 వేల కోట్లు కేటాయించగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని 66 శాతం పెంచి రూ.79 వేల కోట్లు కేటాయించారు. అలాగే, పెనాల్టీలు చెల్లించేందుకు లేదా బెయిల్ కోసం డిపాజి ట్లు కట్టేందుకు డబ్బులు లేక ఏండ్లకేండ్లుగా జైలులోనే మగ్గుతున్న పేద ఖైదీలకు ఆర్థిక సాయం చేయాలని ఈ బడ్జెట్​లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. దేశవ్యాప్తంగా డ్రైనేజీల క్లీనింగ్​ను వంద శాతం మిషన్ హోల్ మోడ్ కు మార్చనున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. 

ఇతర స్కీంలకు కేటాయింపులు ఇలా
స్వచ్ఛ భారత్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.11.7 కోట్లతో టాయ్‌‌‌‌‌‌‌‌లెట్ల నిర్మాణం. 
పీఎం సురక్ష బీమా యోజన లబ్ధిదారులు 44 కోట్లు. 
రాష్ట్రాలకు వడ్డీ లేని రుణాల పథకం మరో ఏడాది పొడిగింపు. బడ్జెట్ లో రూ. 13.7 లక్షల కోట్లు కేటాయింపు.  
పీఎం కౌశల్‌‌‌‌‌‌‌‌ యోజన 4.0లో భాగంగా 4 లక్షల మంది యువతకు శిక్షణ. 
ఇంటింటికీ నల్లా నీరు ( హర్ ఘర్ నల్ సే జల్) పథకంలో ఈ ఏడాది 3.8  కోట్ల ఇండ్లకు తాగునీరు. 
చిన్న మధ్యతరగతి పరిశ్రమలకు             
ప్రోత్సాకాలు.. క్రెడిట్ గ్యారంటీ స్కీమ్.
నిరుద్యోగుల కోసం కొత్త స్కీమ్.. పాన్ ఇండియా నేషనల్ అప్రెంటిస్ షిప్ స్కీమ్ పేరుతో అమలు. 

ఆ అడవిబిడ్డలకు స్పెషల్ ప్రోగ్రాం     
ప్రమాదంలో ఉన్న ఆదివాసీ, గిరిజన తెగల సామాజిక, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడం కోసం మూడేండ్ల పాటు ప్రత్యేక పథకాన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధాన మంత్రి పర్టిక్యులర్లీ వల్నరేబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీఎం పీవీటీజీ) పేరుతో ప్రవేశపెట్టనున్న ఈ పథకానికి తాజా బడ్జెట్ లో రూ. 15 వేల కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. పీవీటీజీ సంబంధిత ప్రజలు నివసించే ప్రాంతాల్లో ఇండ్లు, స్వచ్ఛమైన తాగునీరు, శానిటేషన్, వైద్యం, విద్య, పోషకాహారం, రోడ్డు, టెలికం సౌలతులతో పాటు వారికి ఉపాధి అవకాశాలను పెంచేందుకు కూడా ఈ స్కీం కింద చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.