సామాన్యునికి షాక్.. వంట గ్యాస్‌పై రూ. 25 పెంపు

సామాన్యునికి షాక్.. వంట గ్యాస్‌పై రూ. 25 పెంపు

కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి

సామాన్యులకు చమురు కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. ఎల్‌పిజి సిలిండర్‌ ధరలు పెంచాలని కేంద్రం నిర్ణయించడంతో గ్యాస్ రేట్లను పెంచుతున్నట్లు చమురు కంపెనీలు ప్రకటించాయి. అందులో భాగంగా ఈ రోజు (గురువారం) నుంచి కొత్త రేట్లు అమలులోకి వస్తాయి. చమురు సంస్థలు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, కుకింగ్ సిలిండర్ ధరను యూనిట్‌కు 25 రూపాయలు పెంచారు. అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ ధరను యూనిట్‌కు 184 రూపాయలు పెంచారు.

తాజాగా పెరిగిన ధరలతో హైదరాబాద్‌లో కుకింగ్ సిలిండర్ ధర రూ. 771.50 రూపాయలకు చేరింది. గతంలో ఈ ధర రూ. 746.50గా ఉంది. ఒక్కసారిగా రూ. 25 రూపాయలు పెరగడంతో సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఎల్‌పిజి వంట గ్యాస్ సిలిండర్ ధర రూ .664 నుంచి రూ .719కి చేరింది. లక్నోలో ఎల్‌పిజి ధర రూ .732 నుంచి రూ .757గా చేరింది. నోయిడాలో ఎల్‌పిజి ధర రూ .692 నుంచి రూ .717కు పెరిగింది. కమర్షియల్ (19 కిలోలు) సిలిండర్ ధర రూ. 184 పెరిగడంతో రూ .1349 నుంచి రూ .1533కి చేరింది.

చమురు కంపెనీలు 2020 డిసెంబర్‌లో ఎల్‌పిజి ధరలను రెండుసార్లు పెంచాయి. ఆ తర్వాత జనవరి 2021లో ధరలను పెంచలేదు. దాంతో ఫిబ్రవరి 2021లో చమురు కంపెనీలు ఎల్‌పిజి ధరలను పెంచాయి.

వివిధ పట్టణాల్లో పెరిగిన రేట్లు 

For More News..

ప్రపంచంలోనే తొలిసారిగా రెండు చేతులు, ఫేస్ ట్రాన్స్‌ప్లాంట్

రేషన్ షాపుల్లోనే ఆధార్-ఫోన్ నెంబర్ లింకింగ్

సీఎం కార్యక్రమంలో బిర్యానీ తిని 145 మందికి అస్వస్థత