ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బందికి 40 శాతం రిస్క్ అలవెన్స్‌‌‌‌

ఎన్​డీఆర్​ఎఫ్ సిబ్బందికి 40 శాతం  రిస్క్ అలవెన్స్‌‌‌‌

న్యూఢిల్లీ: ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం 40% రిస్క్ అలవెన్స్‌‌‌‌ ప్రకటించింది. వారు చేసే కఠినమైన విధులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌‌‌‌లోని 21,625 ఫీట్ల ఎత్తైన మణిరంగ్‌‌‌‌ పర్వతం కొలతలు విజయవంతం గా సేకరించిన 35 మందితో కూడిన ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ ఎఫ్ టీమ్​కు స్వాగతం చెప్తూ శనివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 “చాలాకాలంగా పెండింగ్​లో ఉన్న.. ఎన్‌‌‌‌డీఆర్‌‌‌‌ఎఫ్ సిబ్బందికి 40% రిస్క్ అలవెన్స్ ఇవ్వాలనే డిమాండ్​ను కేంద్రం శుక్రవారం ఆమోదించింది. దీంతో ఈ ఫోర్స్‌‌‌‌ లోని 16 వేల మంది సిబ్బందికి ప్రయోజనం చేకూరుతుంది” అని షా అన్నారు. విపత్తుల సమయంలో ‘‘జీరో క్యాజువాలిటీ’’ విధానాన్ని అనుసరించాలని, ప్రాణనష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు. ప్రత్యేక దళాల్లో స్పోర్ట్స్​ను ఒక కల్చర్​గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపా రు. నేషనల్, ఇంటర్నేషనల్ టోర్నమెంట్లలో ఈ దళాల నుంచి ఒక టీమ్ పార్టిసిపేట్ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.