న్యూఢిల్లీ: స్మాల్ సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 8.2 శాతానికి పెంచింది. ఏప్రిల్–జూన్ క్వార్టర్‌కు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీము, సుకన్య సమృద్ధి అకౌంట్ స్కీము, మంత్లీ ఇన్కమ్ సేవింగ్స్ స్కీము, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్, కిసాన్ వికాస్ పత్రతో పాటు, అన్ని పోస్ట్ ఆఫీస్ టైము డిపాజిట్ల పైనా కూడా ఇదే వడ్డీని చెల్లిస్తారు. అయితే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) స్కీముపై వడ్డీ రేటును మాత్రం 7.1 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించారు. రేట్ల పెంపుదల వల్ల రాబోయే క్వార్టర్లో డిపాజిట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
