
భోపాల్ : గతంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం.. యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) లను ఏర్పాటు చేసిందని ఆ పార్టీ నేత ప్రియాంకా గాంధీ చెప్పారు. కానీ ఈ సంస్థలను తమ మిత్రులైన పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టడం, ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడమే బీజేపీ పాలసీగా మారిందని మండిపడ్డారు.
బుధవారం మధ్యప్రదేశ్‌లోని సన్వేర్‌లో ఎన్నికల సభలో ప్రియాంక మాట్లాడారు. పథకాల ద్వారా ప్రజలకు డబ్బు తిరిగి రావాలని, కానీ పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారని అన్నారు. దేశమంతటా బీజేపీ విధానం ఇలాగే ఉందని ఆరోపించారు.