ఫిబ్రవరి 06 నుంచి.. రూ.29కే కేజీ బియ్యం

ఫిబ్రవరి 06 నుంచి..  రూ.29కే కేజీ బియ్యం

భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది.  2024 ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ దీనిని ప్రారంభించనున్నారు.  మొదటి దశలో  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI) నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) మరియు నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF), కేంద్రీయ భాండార్  విక్రయ కేంద్రాల ద్వారా అమ్ముతారు. 

ఈ ఏజెన్సీలు 5 కిలోలు,10 కిలోల బియ్యాన్ని ప్యాక్ చేసి విక్రయిస్తాయి.  గత ఏడాది కాలంలో ధాన్యం రిటైల్ ధరలు 15 శాతం పెరిగడంతో కేంద్రం భారత్ రైస్ కు శ్రీకారం చుట్టింది. ఫస్ట్ ఫేజ్​లో భాగంగా.. 5లక్షల టన్నుల బియ్యాన్ని రిటైల్ మార్కెట్​లో అమ్మేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కిలో రూ.27.50 చొప్పున భారత్ ఆట, రూ.60 కిలో భారత్ దాల్ (శనగ పప్పు) విక్రయిస్తుంది.