ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4గంటలవరకు క్యూలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. ఉదయం 8  గంటల  నుంచి పెద్దఎత్తున పట్టభద్రులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. సాయత్రం 3గంటల వరకు 57శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. ఫైనల్ పోలింగ్ శాతాన్ని కాసేపట్లో ఈసీ అధికారికంగా ప్రకటించనుంది.

 మూడు ఉమ్మడిజిల్లాల్లోని 605 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఈనెల 5వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మొత్తం 52 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ప్రధాన పార్టీలు కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న,  బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి  ప్రేమేందర్‌రెడ్డి బరిలో నిలిచారు.