సర్పంచ్ ఎన్నికలు వాయిదా వెయ్యాలి..ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన

సర్పంచ్ ఎన్నికలు వాయిదా వెయ్యాలి..ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన
  •  భారీగా ట్రాఫిక్ జామ్

ట్యాంక్ బండ్, వెలుగు: బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలను వెంటనే వాయిదా వేయాలని బీసీ రిజర్వేషన్ల సాధన సమితి డిమాండ్ చేసింది. బుధవారం సాధన సమితి ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. 

ఈ కార్యక్రమానికి విశారదన్ మహారాజ్, బాలగోని బాలరాజ్ గౌడ్, ఆయిలి వెంకన్న గౌడ్, ఎలికట్టే విజయ్ కుమార్ గౌడ్, కోలా జనార్దన్ హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం విషారదన్ మహారాజ్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయక, చెల్లని జీవోలు తెచ్చి న్యాయస్థానంలో పరువు తీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనతో ట్యాంక్ బండ్, లిబర్టీ, హిమాయత్ నగర్, బషీర్​బాగ్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.