ఉమ్మడి ఖమ్మం, వరంగల్: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

ఉమ్మడి ఖమ్మం, వరంగల్: ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి

వెలుగు, నెట్​వర్క్​: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆఫీసర్లు అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిలో భాగంగా బుధవారం ఉమ్మడి ఖమ్మం, వరంగల్​జిల్లాల్లో ఆయా శాఖల ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ హాజరై గ్రామాల అభివృద్ధిపై మాట్లాడారు. వరంగల్​ జిల్లా వర్ధన్నపేట మండలం బండౌతాపురంలో నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్​ సత్యశారద పాల్గొని రైతులు పంట మార్పిడికి సహకరించాలని, గ్రామ పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, సర్​నిర్వహణపై అవగాహన కల్పించారు. నల్లబెల్లి మండలం పంతులుపల్లిలో నర్సంపేట ఆర్డీవో ఉమారాణి పాల్గొని మాట్లాడారు. 

మహబూబాబాద్​ జిల్లా పెద్దవంగర మండలం ఉప్పెరగూడెంలో చేపట్టిన కార్యక్రమంలో కలెక్టర్​ స్నేహశబరీశ్​పాల్గొని గంజాయి సహా మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్​గూడెంలో నిర్వహించిన గ్రామసభలో సీపీ సునీల్​దత్​మాట్లాడుతూ హెల్మెట్, సీట్​బెల్ట్​తో ప్రాణాలకు రక్షణ అని సూచించారు.​ ధర్మతండాకు చెందిన అక్క, తమ్ముడు రోడ్డు ప్రమాదం అరుగగా, బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. జూలూరుపాడులో ఎస్పీ రోహిత్​రాజ్, సంగెం మండలం రామచంద్రాపురంలో మామునూర్​ ఏసీపీ వెంకటేశ్, గోవిందరావుపేట మండలం పస్రాలో సీఐ దయాకర్​పాల్గొని రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు.