నల్గొండ జిల్లా కేంద్రంలోని మర్రిగూడెం గ్రామంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా సోమవారం బోనాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఊరువాడా ఏకమై తమ మొక్కులు తీర్చుకునేందుకు గడపకో బోనం సిద్ధం చేసుకున్నారు.
మహిళలు భక్తిశ్రద్ధలతో బోనాలు ఎత్తుకుని డీజే, డప్పుల మోతల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
– వెలుగు, ఫొటోగ్రాఫర్, నల్గొండ
