
కరీంనగర్ టౌన్, వెలుగు: భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సిటీలో ఘనంగా జరిగాయి. సోమవారం జడ్పీ ప్రాంగణంలో పంచాయతీరాజ్ కరీంనగర్ రీజియన్ ఇంజినీర్స్ ఆధ్వర్యంలో విశ్వేశ్వరయ్య విగ్రహానికి ఎస్ఈ కె.లచ్చయ్య ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్య సేవలను ప్రతీ ఇంజినీర్ స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఈఈ టి.భూమేశ్వర్, డీపీఆర్‌వో ఎంఎ రహమాన్, పెద్దపల్లి ఈఈ శంకరయ్య, డీఈఈ చిన్నయ్య, డీఈలు జనార్దన్, రాజేంద్రప్రసాద్, రవిప్రసాద్, మంజుల భార్గవి, రాజేశ్వర్ ప్రసాద్, రమణారెడ్డి, పంచాయతీరాజ్ డిప్లొమా ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్, పాల్గొన్నారు.
గోదావరిఖని, వెలుగు: ఇంజినీర్స్ డే సందర్భంగా సోమవారం గోదావరిఖని కల్యాణ్‌నగర్‌లో రామగుండం లయన్స్ క్లబ్మగువ శాఖ ఆధ్వర్యంలో ఇంజినీర్లు సోమారపు లావణ్య, అర్చనారావును శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో క్లబ్ప్రతినిధులు సునీత, డాక్టర్ లక్ష్మీవాణి, వనజారాపోల్ పాల్గొన్నారు.