
నెట్‌వర్క్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు సాయిబాబా ఆలయాల్లో గురువారం ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో ప్రజలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పలు ఆలయాల్లో పల్లకీ సేవలు, ప్రత్యేక పూజలు చేశారు. కరీంనగర్‌లోని జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అటానమస్ కాలేజీలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
విద్యాసంస్థల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, చైర్ పర్సన్ విజయ, సెక్రటరీ కరెస్పాండెంట్ సుమిత్ సాయి, మాజీ మేయర్ సునీల్ రావు సతీమణి అపర్ణ పాల్గొన్నారు. కోరుట్ల సాయి ఆలయంలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగారావు, ఎమ్మెల్యే కె.సంజయ్ వేర్వేరుగా పూజలు చేశారు. చొప్పదండి, రాయికల్ మండలం ఇటిక్యాల, సుల్తానాబాద్ రాజమాత ఆలయంలో వేడుకలు నిర్వహించారు.