
వేములవాడ, వెలుగు: పెద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వేములవాడలో హనుమాన్ సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ సేవా సమితి ప్రతినిధి మొట్టల మహేశ్ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షదారులతో పాటు భక్తులు జై శ్రీరామ్ నినాదాలు, డ్యాన్సులు చేస్తూ పట్టణంలోని పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. స్వాములకు మహిళలు, భక్తులు మంగళహారతులతో ఘనంగా స్వాగతంతో పాటు అభిషేకాలు నిర్వహించారు. శోభాయాత్రలో విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, వివిధ పార్టీల లీడర్లు ప్రతాప రామకృష్ణ, రామతీర్థపు రాజు, మాధవి, టౌన్ సీఐ వీరప్రసాద్ పాల్గొన్నారు.
జమ్మికుంట, వెలుగు: జమ్మికుంట మండలం పాపయ్యపల్లిలో హనుమాన్ భక్తులు హనుమాన్ నామస్మరణ చేస్తూ మంగళవారం ఘనంగా శోభాయాత్ర నిర్వహించారు. అభయాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి గణపతి పూజ, పుణ్యా వచనం, కలశ పూజ నిర్వహించి స్వామివారిని రథంపై ప్రతిష్టించి పురవీధుల్లో ఊరేగించారు.