భీమవరంలో ప్రధాని మోడీ

భీమవరంలో ప్రధాని మోడీ

విజయవాడ: రెండు రోజుల హైదరాబాద్ పర్యటనను ముగించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోడీ సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని గన్నవరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయంలో దిగిన మోడీకి సీఎం వైఎస్ జగన్, గవర్నర్ బిశ్వభూషన్ స్వాగతం పలికారు. గన్నవరం నుంచి హెలికాప్టర్ మోడీ భీమవరానికి వెళ్లారు. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా అక్కడ ఏర్పాటుచేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. భీమవరం ఏఎస్ఆర్ నగర్ లోని మున్సిపల్ పార్కులో  రూ.3 కోట్లతో  ఏర్పాటుచేసిన 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ కాసేపట్లో ఆవిష్కరించనున్నారు. అల్లూరి కాంస్య విగ్రహం బరువు 15 టన్నులు. విగ్రహావిష్కరణ తర్వాత పెద అమిరం బహిరంగ సభలో పాల్గొనేందుకు మోడీ వెళ్తారు. సభలో ప్రసంగించిన అనంతరం మధ్యాహ్నం 12.25 గంటలకు తిరిగి భీమవరానికి చేరుకొని..  అహ్మదాబాద్ కు మోడీ వెళ్లిపోతారు.