టీమిండియాకు అదిరిపోయే స్వాగతం

టీమిండియాకు అదిరిపోయే స్వాగతం

ఆసీస్పై టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్కు సిద్ధమైంది. సిరీస్లో భాగంగా ఫస్ట్ టీ20 ఆడేందుకు తిరువనంతపురానికి చేరుకుంది. తిరువనంతపురంలో భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. 

హోటల్ వద్ద భద్రత కట్టుదిట్టం..
ఎయిర్ పోర్టు నుంచి హోటల్కు చేరుకున్న భారత ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు స్పెషల్ అరేంజ్మెంట్స్ చేసింది. బస్ దిగి హోటల్‌కు వచ్చే దారిలో ప్లేయర్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించారు. అలాగే  ప్లేయర్ల మెడలో మెడల్స్ వేయించారు.  సంప్రదాయ కేరళ చీరకట్టుతో మెరిసిన అమ్మాయిల స్వాగతాల మధ్య ప్లేయర్లు, సపోర్టింగ్ స్టాఫ్ హోటల్లోకి వెళ్లారు. ప్లేయర్ల బస నేపథ్యంలో  హోటల్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

సంజూ నామస్మరణ
అంతకుముందు ఎయిర్ పోర్టులో సంజూ శాంసన్ అభిమానులు రచ్చచేశారు. టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు అన్యాయం చేశారని ఫ్యాన్స్  ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళకు చెందిన సంజూ శాంసన్‌కు రాష్ట్రవ్యాప్తంగా భారీగా అభిమానులు ఉన్నారు. దీంతో సంజూకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.

సంజూ ఫొటో చూపిన SKY..
ఎయిర్ పోర్టు బయట సంజూ శాంసన్ ఫ్యాన్స్ నామస్మరణ చేయడంతో..సూర్యకుమార్ యాదవ్ తన మొబైల్‌లో ఉన్న సంజూ ఫొటోను ఫ్యాన్స్కు చూపించాడు. అటు  అశ్విన్, చాహల్ తమ ఇన్‌స్టాలో త్రివేండ్రంలో సంజూ పేరు దద్దరిల్లుతుందని పేర్కొన్నారు.

భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, ఉమేష్ యాదవ్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా

సౌతాఫ్రికా టీ20 జట్టు:
టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎన్‌గిడి, అన్రిచ్ నార్జ్, వేన్ పార్నెల్, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, రివైస్ రబాడా, ట్రిస్టన్ స్టబ్స్, బ్జోర్న్ ఫోర్టుయిన్, మార్కో జాన్సెన్, ఆండిలే ఫెహ్లుక్వాయో