చేపలు పట్టేందుకు వెళ్లిన తాతా మనవడు మృతి

చేపలు పట్టేందుకు వెళ్లిన తాతా మనవడు మృతి

మహాముత్తారం, వెలుగు: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన తాత, మనవడు నీట మునిగి చనిపోయిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం బోర్లగూడెంలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బోర్లగూడెం గ్రామానికి చెందిన భీముని భూమయ్య(55) కొడుకు రవి రెండేళ్ల క్రితం యాక్సిడెంట్​లో చనిపోయాడు. అప్పటి నుంచి మనవడు రుషి(11) భూమయ్య దగ్గరే ఉంటున్నాడు. ఆదివారం ఇద్దరూ పొలం దున్నేందుకు వెళ్లారు. ఆ తర్వాత చేపలు పట్టేందుకు శంకరంపహాడ్ చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తు రుషి నీళ్లలో పడిపోయాడు. అతన్ని కాపాడేందుకు చెరువులో దిగిన భూమయ్య కూడా నీట మునిగాడు. కొద్దిసేపటికి గమనించిన గ్రామస్తులు గాలించి మృతదేహాలను వెలికి తీశారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.