రాజ్యాంగ పరిరక్షణ కోసం యుద్ధభేరి మహాసభ

రాజ్యాంగ పరిరక్షణ కోసం యుద్ధభేరి మహాసభ

రాజ్యాంగ రక్షణ పోరాటంలో అందరూ భాగస్వాములు కావాలని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను నిరసిస్తూ నిర్వహిస్తున్న రాజ్యాంగ పరిరక్షణ పోరాటంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు. నల్గొండ జిల్లా నకిరేకల్ లో ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాదులో ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించనున్న రాజ్యాంగ పరిరక్షణ మహా ప్రదర్శన యుద్ధభేరి మహాసభకు ప్రజలంతా కులమతాలకు అతీతంగా తరలిరావాలని కోరారు. 

 

ఇవి కూడా చదవండి

ఓయూలో పూర్వ విద్యార్థుల అరుదైన సమ్మేళనం

పన్ను కట్టలేదని రిజిస్ట్రేషన్ ఆఫీసు సీజ్

భారత్ లో చైనా విదేశాంగ మంత్రి పర్యటన