ఎంబాపె గోల్స్ వర్షం..పోలండ్పై ఫ్రాన్స్ విజయం

ఎంబాపె గోల్స్ వర్షం..పోలండ్పై ఫ్రాన్స్ విజయం

ఫిఫా వరల్డ్ కప్లో ఫ్రాన్స్ జోరు కొనసాగుతోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఫ్రాన్స్...ప్రీక్వార్టర్స్లో పోలండ్ను ఓడించి క్వార్టర్లో అడుపెట్టింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఫ్రాన్స్ 3–1 గోల్స్  తేడాతో విజయం సాధించింది. ఫ్రాన్స్ తరపున  ఆలివియర్ గిరోడ్ ఒక గోల్ కొట్టగా...ఎంబాపే రెండు గోల్స్ సాధించాడు. అటు పోలండ్ తరపున  రాబర్ట్ లెవాండోస్కి మాత్రమే గోల్ కొట్టాడు. 

ఫస్టాఫ్లో ఫ్రాన్స్దే పైచేయి..

క్వార్టర్ ఫైనల్ చేరాలంటే గెలవాల్సిన మ్యాచ్లో ఫ్రాన్స్, పోలండ్ హోరా హోరీగా తలపడ్డాయి. ఆరంభం నుంచే దూకుడును ప్రదర్శించాయి.  అయితే ప్రత్యర్థిపై  ఫ్రాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని కనభర్చింది. తొలి అర్థభాగంలో ఫ్రాన్స్  తొమ్మిది సార్లు గోల్ చేసేందుకు ప్రయత్నించింది. అటు పోలండ్ కూడా ఎనిమిదిసార్లు ఫ్రాన్స్ గోల్ పోస్టుపై దాడి చేసింది. కానీ రెండు జట్లు గోల్ కొట్టలేకపోయాయి. ఈ సమయంలో ఆలివియర్ గిరోడ్ ఫ్రాన్స్కు ఆధిక్యాన్ని అందించాడు. 44వ నిమిషంలో కిలియన్ ఎంబాపే నుంచి పాస్ అందుకున్న ఆలివియర్ గిరోడ్... తొలి గోల్ సాధించాడు. దీంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఫ్రాన్స్ 1–0తో ఆధిక్యంలో నిలిచింది. 

సెకండాఫ్లో దూకుడు..

రెండో అర్థభాగంలో రెండు జట్లు గోల్ సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నించాయి. అప్పటికే ఆధిక్యంలో ఉన్న ఫ్రాన్స్... 74వ నిమిషంలో మరో గోల్ కొట్టి..2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.  ఒస్మాన్ డెంబెలే అందించిన పాస్‌ను ఎంబాపే అద్భుతంగా గోల్‌ కొట్టాడు. అటు సెకండ్ హాఫ్ స్టాపేజ్ టైంలో ఎంబాపే మరో గోల్ చేయడంతో ఫ్రాన్స్ ఆధిక్యం 3-0కు పెరిగింది. అయితే చివర్లో కమిల్ గ్రోసికిని ఫ్రాన్స్ ఫౌల్ చేసింది. దీంతో పోలండ్‌కు పెనాల్టీ కిక్ లభించింది. మొదటి ప్రయత్నంలో గోల్ సాధించలేకపోయిన పోలండ్..ఆ తర్వాత ఛాన్స్లో  రాబర్ట్ లెవాండోస్కి గోల్ సాధించడంతో...పరువు దక్కించుకుంది. చివరకు  3–1 తేడాతో ఫ్రాన్స్ విజయం సాధించింది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ ఇంగ్లండ్‌తో ఆడనుంది.