జీరో పొల్యూషన్ : రామ మందిరం చుట్టూ 2 వేల చార్జింగ్ పాయింట్స్

జీరో పొల్యూషన్ : రామ మందిరం చుట్టూ 2 వేల చార్జింగ్ పాయింట్స్

ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం జీరో పొల్యూషన్ దిశగా చర్యలు చేపడుతోంది. ఢిల్లీ, దాని సమీప ప్రాంతాలైన నోయిడా, యూపీలోని ఆగ్రా, మిగతా ప్రాంతాల్లో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు ఉత్తరప్రదేశ్లోని పర్యాటక ప్రాంతాల్లో కాలుష్యాన్ని తగ్గించి పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అందులో భాగంగానే ఆ రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది.

అయోధ్యలోని రామమందిరం , తాజ్ మహల్ తో సహా వివిద పర్యాటక ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకోసం కనీసం 2వేల పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. పెట్రోల్ వినియోగం తగ్గించడం.. పర్యావరణ సమస్యలపై నియంత్రించేందుకు ఏకైక పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకే ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తు్న్నట్లు ప్రాజెక్టు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ ఎక్స్ ప్రెస్ వేస్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అథారిటీ అధికారులు చెబుతున్నారు. 

రికార్డుల ప్రకారం.. యూపీలో అత్యధికంగా 4లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. ఢిల్లీ లో లక్షా 83 వేలు, మహారాష్ట్ర లో 1 లక్షా 79 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి. అత్యధికంగా ఈ ఆటోలు ఉన్న రాష్ట్రాల జాబితాలో యూపీ అగ్రస్థానంలో ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేందుకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు కీలకం అందుకే వీటిని పెంచేందుకు యూపీ సర్కార్ చర్యలు చేపడుతోంది.