ఐనాక్స్ ఇండియా, స్టాన్లీ లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్స్ ఐపీఓలకు గ్రీన్​సిగ్నల్​

ఐనాక్స్ ఇండియా, స్టాన్లీ లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్స్ ఐపీఓలకు గ్రీన్​సిగ్నల్​

న్యూఢిల్లీ: క్రయోజెనిక్ ట్యాంక్ తయారీ సంస్థ ఐనాక్స్ ఇండియా,  లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ స్టాన్లీ  ఐపీఓల ద్వారా నిధులను సేకరించేందుకు క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది  ఆగస్టు,  సెప్టెంబరులో ఐపీఓ డాక్యుమెంట్లను ఇచ్చిన ఈ రెండు కంపెనీలు నవంబర్ 29-–30 మధ్య  అబ్జర్వేషన్ ​లెటర్లు పొందాయని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మంగళవారం  వెల్లడించింది. డ్రాఫ్ట్ పేపర్ల ప్రకారం, ఐనాక్స్ ఇండియా  ఐపీఓ పూర్తిగా ఓఎఫ్​ఎస్​ ఇష్యూ. దీని  ప్రస్తుత వాటాదారులు,  ప్రమోటర్ల ద్వారా 2.21 కోట్ల షేర్ల వరకు అమ్మకానికి ఉంచుతారు. 

 వడోదరకు చెందిన ఈ కంపెనీ ఐపీఓ ద్వారా ఆదాయాన్ని పొందదు.  మొత్తం నిధులన్నీ  వాటాదారులకు వెళ్తాయి.  ఐనాక్స్ ఇండియా, డిజైన్, ఇంజినీరింగ్, తయారీ  క్రయోజెనిక్ పరిస్థితుల కోసం పరికరాలు  సిస్టమ్‌‌‌‌‌‌‌‌ల ఇన్‌‌‌‌‌‌‌‌స్టాలేషన్‌‌‌‌‌‌‌‌లో పరిష్కారాలను అందించడంలో 30 సంవత్సరాల అనుభవాన్ని సంపాదించింది. స్టాన్లీ లైఫ్‌‌‌‌‌‌‌‌స్టైల్స్ ఐపీఓలో ప్రెష్​ఇష్యూ,  ఓఎఫ్ఎస్​ ఉంటాయి. ప్రమోటర్లు, ఇన్వెస్టర్,  ఇతర వాటాదారులు రూ. 200 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను అమ్ముతారు. తాజా ఇష్యూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని కొత్త స్టోర్లను తెరవడానికి, ఇప్పటికే ఉన్న స్టోర్ల పునరుద్ధరణకు వినియోగిస్తారు.