
అప్పుల కుప్పగా మారిన హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీ డీహెచ్ ఎఫ్‌ఎల్ దివాలా ప్రక్రియను మొదలుపెట్టడానికి ఆర్ బీఐ వేసిన కేసును
నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ) ముంబై బెంచ్ ఆమోదించింది. డీహెచ్ ఎఫ్‌ఎల్ కార్పొరేట్ దివాలా ప్రక్రియ మొదలుపెట్టాలంటూ ఆర్ బీఐ శుక్రవారమే పిటిషన్ వేసింది. దివాలా కేసు విచారణ కొనసాగినంతకాలం డీహెచ్ ఎఫ్‌ఎల్ పై డెట్ మా
రటోరియం కొనసాగుతుందని ఆర్ బీఐ వివరణ ఇచ్చింది. అంటే ఈ సమయంలో కంపెనీ ఎలాంటి బకాయిలూ చెలించదు. దివాలా చట్టంలోని సెక్షన్లు 227, 239 ప్రకారం ఆర్ బీఐ పిటి షన్ దాఖలు చేసింది. కంపెనీ బోర్డును రద్దు చేసి సుబ్రమణియకుమార్ ను అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. చట్ట ప్రకారం కంపెనీ పై దివాలా ప్రక్రియను ప్రారంభించేందుకే డీహెచ్ ఎఫ్‌ఎల్ బోర్డుపై ఆర్ బీఐ వేటు వేసింది.
ఎన్సీఎల్టీ విచారణను ఎదుర్కొంటున్న తొలి ఎన్ బీఎఫ్‌సీ కూడా డీహెచ్ ఎఫ్‌ఎలే అవుతోంది. గత కొన్ని నెలలుగా పేమెంట్లు చేయడంలో వరసగా విఫలమవుతుండటంతో డీహెచ్ ఎఫ్‌ఎల్ పై చర్యలకు ఆర్ బీఐ రంగంలోకి దిగింది. కంపెనీ నిర్వహణపై
సర్వత్రా ఆందోళనలు నెలకొనడంతో డీహెచ్ ఎఫ్‌ఎల్ బోర్డుపైనే ఆర్ బీఐ వేటు వేసింది. ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో కుమార్ ను డీహెచ్ ఎఫ్‌ఎల్ కు అడ్మినిస్ట్రేటర్ గా ఆర్ బీఐ నియమించింది. బ్యాంకులకు, మ్యూచు వల్ ఫండ్స్‌కు భారీ మొత్తంలో డీహెచ్ ఎఫ్‌ఎల్ బకాయి పడింది. అంతేకాదు, దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఈ కంపెనీలో డిపాజిట్ల రూపంలో ఇన్వెస్ట్ చేశారు. డీహెచ్ ఎఫ్‌ఎల్ మొత్తంగా రూ.లక్ష కోట్ల వరకు బాకీలు చెల్లించాల్సి ఉంది. కనీసం రూ.500 కోట్ల వరకు ఆస్తులున్న నాన్ బ్యాంకిం గ్ ఫైనాన్సి యల్ కంపెనీల రిజల్యూషన్ ను కోరే అధికారం ఆర్ బీఐకి ఉంటుంది.