పచ్చబడ్డ ప్రపంచం

పచ్చబడ్డ ప్రపంచం
  • మరో అమెజాన్ ఫారెస్టును సృష్టించిన ఇండియా-చైనా

ప్రపంచం పచ్చబడుతోం ది. ఇందుకు ఇండియా-చైనా నాటి న మొక్కలే కారణమని నాసా రీసెర్చ్ లో తేలింది. ప్రపంచంలో అత్యధిక కాలుష్యాన్నిమొదటి మూడు దేశాల్లో చైనా, ఇండియా ఉన్నాయి. వీటిని తగ్గించేం దుకు కొన్నేళ్లుగా ఊరూరా మొక్కలు పెంచుతున్నారు. దీని వల్ల 2000 సంవత్సరం నుంచి ఏటా ఐదు శాతం మేర పచ్చదనం పెరుగుతూ, మొత్తం మీద 20 లక్షల చదరపు మైళ్ల దూరం కొత్త మొక్కలు పెరిగాయట.

అంటే కొత్తగా మరో అమెజాన్ అడవిని మళ్లీ భూమిపై పుట్టించారని నాసా సైంటిస్టులు పేర్కొన్నారు. అయితే, ఏ స్థా యిలో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందో, అంతకంటే ఎక్కువ స్థాయిలో అడవుల నరికివేత జరుగుతోందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. పచ్చదనం పెరుగుదలలో చైనా భాగస్వామ్యం ఎక్కువగా ఉందని చెప్పారు. ఇదే సమయంలో ప్రపంచంలో జరుగుతున్న అడవుల నరికివేతలో చైనా వాటా 6.6 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. ఇండియా వల్ల ప్రపంచ పచ్చదనం 6.8 శాతం పెరిగినట్లు తెలిపారు. తొలుత భూమి పచ్చదనం పెరగడాన్ని చూసి వాతావరణ మార్పు వల్ల అలా కనిపిస్తుందేమోనని భావించి నట్లు సైంటిస్టులు వివరించారు. కానీ, శాటిలైట్ మోడిస్ టూల్స్‌‌తో పరిశీలించి న తర్వాత అసలు విషయం తెలిసినట్లు వెల్లడించారు.