
- మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట కలెక్టరేట్లలో గ్రీవెన్స్
- స్వయంగా ఫిర్యాదులు తీసుకున్న కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు
మెదక్, వెలుగు: మెదక్ కలెక్టరేట్ లో ప్రజావాణికి వచ్చిన ప్రజలు సమస్యలపై కలెక్టర్ కు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రీవెన్స్ లో వచ్చిన అర్జీలను పరిష్కరించడంలో వివిధ శాఖల అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. గ్రీవెన్స్ దరఖాస్తులకు అధికారులు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సత్వర పరిష్కారం చూపి ప్రజలకు ఊరట కల్పించాలన్నారు.
సిద్దిపేటలో 120 ఫిర్యాదులు
సిద్దిపేట టౌన్, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కే.హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ తో కలసి ప్రజల నుండి 120 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సంగారెడ్డిలో ప్రజావాణికి 54 దరఖాస్తులు
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ 15, పౌరసరఫరాల శాఖ 09, పంచాయతీ రాజ్ 09, డీఆర్డీఓ 09, వివిధ శాఖలకు సంబంధించి12, మొత్తంగా 54 ఫిర్యాదులు అందాయి. ప్రజా ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా పరిశీలన జరుపుతూ సమస్యలను పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జడ్పీ సీఈఓ జానకిరెడ్డి,వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.