బుల్డోజర్పై పెళ్లి కొడుకు ఊరేగింపు..

బుల్డోజర్పై పెళ్లి కొడుకు ఊరేగింపు..

ఓ వివాహ వేడుకలో పెళ్లి కొడుకు బుల్డోజర్ల ఊరేగింపుతో వచ్చాడు. ఇది చూసిన జనాలు ఆశ్చర్యనికి లోనయ్యారు. ఈ వింత సంఘటన ఉత్తరప్రదేశ్ లోని బహ్ రైచ్ చోటు చేసుకుంది. లక్ష్మణ్ పూర్ లో రుబీనా-రాజుల వివాహం జరింగింది. అయితే వీరి ఊరేగింపు కోసం వెరైటీగా బుల్డోజర్ ను ఏర్పాటు చేశారు. వాటిని పూలతో అలంకరించి.. వుడెన్ ప్లాంక్ ఏర్పాటు చేసి దానిపై పెళ్లింటికి వచ్చాడు వరుడు రాజు. ఈ ఊరేగింపును చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు వచ్చారు. బుల్డోజర్ బాబాకీ జై అని నినాదాలు చేశారు. మొత్తం 6 బుల్డోజర్లపై పాటలు పాడుతూ పెళ్లింటికి చేరుకున్నారు వరుడి కుటుంబసభ్యులు. ప్రస్తుతం బుల్డోజర్ తో వచ్చిన పెళ్లి బరాత్ వీడియో వైరల్ గా మారింది.