
న్యూఢిల్లీ: ఐపీఓకు సిద్ధమవుతున్న ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ గ్రో, వెల్త్-టెక్ స్టార్టప్ ఫిస్డమ్ కొనుగోలును పూర్తి చేసింది. ఇందుకోసం గత వారం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి అనుమతి పొందింది. దీంతో సోమవారం ఈ లావాదేవీ ముగిసింది. ఇది గ్రో వెల్త్ మేనేజ్‌మెంట్ రంగంలోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమం చేసింది. 'డబ్ల్యూ' అనే కొత్త ఆఫర్ ద్వారా హై నెట్-వర్త్ వ్యక్తులను, (హెచ్ఎన్ఐలు) సంపన్న ఇన్వెస్టర్లను కస్టమర్లుగా మార్చుకుంటామని తెలిపింది. గ్రో ఇప్పటికే రిటైల్ పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్ వంటి సేవలు అందిస్తోంది.