
51 లక్షల కుటుంబాలకు ఉచిత విద్యుత్తు. పేదల పక్షాన ప్రభుత్వం 14 నెలల్లో రూ.2,479 కోట్లు చెల్లించింది. ప్రతి కుటుంబానికి ఏటా సగటున రూ.9,000 మిగులు బాటు. గ్రామీణ ప్రాంతాల్లో 75%, గిరిజన, ఆదివాసి గూడాలలో 90 శాతం మంది లబ్ధి పొందుతున్నారు.
పేదలకు ఆర్థికంగా చేయూతనివ్వాలనే ఉద్దేశంతో చేపట్టిన గృహ జ్యోతి ఒక సాధారణ పథకం కాదు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం సామాన్యుల జీవితాల్లో ఆర్థిక స్వావలంబనకు దోహదపడింది.
పేద, మధ్యతరగతి కుటుంబాల పక్షాన జీరో విద్యుత్ బిల్ మొత్తం 2,479 కోట్లు ప్రభుత్వమే ఇప్పటివరకు చెల్లించింది. ఈ పథకాన్ని నిరంతరం కొనసాగించే ప్రయత్నంలో భాగంగా జీరో బిల్ నగదు ఎప్పటికప్పుడు విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లిస్తూ వస్తోంది. 14 నెలల కాలంలో రాష్ట్రంలో మొత్తంగా 6.98 కోట్ల జీరో బిల్లులను విద్యుత్ సంస్థలు జారీ చేశాయి. ప్రధానంగా పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్ష్యంగా పెట్టుకొని ఈ పథకాన్ని రూపొందించారు.
వికారాబాద్ జిల్లాలో అత్యధిక లబ్ధిదారులు
హైదరాబాద్ మహానగరానికి సమీపంలో ఉండే వికారాబాద్ జిల్లాలో మొత్తం విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 2.10 లక్షలు కాగా 1.57 లక్షల మంది గృహ జ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు అంటే 74 శాతం మంది ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. 200 యూనిట్ల వరకు జీరో బిల్లు వస్తుండడంతో వినియోగదారులకు నెలవారి విద్యుత్ బిల్లు నుంచి ఉపశమనం లభిస్తుంది.
గతంలో నెలకు 600 నుంచి 800 వరకు చెల్లించాల్సిన బిల్లు ఇప్పుడు శూన్యంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో జీవించే ఆదాయం లేని కుటుంబాలు ఇక విద్యుత్తు బిల్లు భారం గురించి ఆలోచన లేకుండా ఇతర అవసరాలను సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు కొంత ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతున్నారు.
ఇంటి విద్యుత్ బిల్లు ఖర్చులు జీరో కావడంతో కొద్దిమంది పేద, మధ్యతరగతి వర్గాలు మిగిలిన మొత్తాన్ని తమ పిల్లల విద్యకు అదనంగా ఖర్చు చేయగలుగుతున్నారు. ఇళ్లలో నుంచి చిన్న తరహా ఉపాధి కార్యక్రమాలు చేపట్టే మహిళలకు ఈ పథకం ఓ ప్రేరణగా నిలిచింది. ఈ పథకం అమలులో స్పష్టత, పారదర్శకత ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచాయి.
గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా గృహ జ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందేందుకు అవకాశం అందుబాటులో ఉంది. గ్రామీణ ప్రాంత ప్రజలు స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు స్థానికంగా ప్రత్యేకంగా సిబ్బందిని ప్రభుత్వం నియమించింది.
తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు, 200 యూనిట్ల లోపు విద్యుత్ బిల్లుకు సంబంధించిన ఆధారాలు తీసుకువెళ్లి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. మున్సిపాలిటీలోనూ ఇదే తరహాలో ప్రజా పాలన సేవా కేంద్రాలను, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నవారు.
జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన ప్రజా పాలన సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందే అవకాశం ఉంది. దీంతో రాష్ట్రంలోని వివిధ వర్గాలకు ఈ పథకం అందుబాటులోకి వచ్చింది.
ఏడాదికి రూ.9000 ఆదా
గృహ జ్యోతి ఉచిత విద్యుత్ పథకం డిమాండ్ క్రియేట్ ఓన్ సప్లై(డిమాండ్ తనంతట తాను సప్లైను సృష్టించుకోవడం) ఆర్థిక సూత్రాన్ని అక్షరాల ఆచరిస్తుంది. గృహ జ్యోతి పథకం ద్వారా నెలకు ఒక కుటుంబానికి 400 రూపాయల నుంచి 600 రూపాయల వరకు మిగులుబాటు ఉంటుంది. ఏడాదికి గరిష్టంగా ఒక కుటుంబానికి ఈ పథకం ద్వారా రూ. 9,000 ఆదా అవుతుంది.
పేద, మధ్యతరగతి వర్గాలకు ఏడాదికి ఒక కుటుంబానికి 9,000 మిగలడంతో ఆ మొత్తాన్ని పిల్లల విద్య, కుటుంబానికి బలమైన ఆహారం, మంచి వైద్యం వంటి అంశాలపై భరోసాతో ఖర్చు చేయగలుగుతున్నారు. అధిక ఉత్పత్తులు సాధించేందుకు వ్యవసాయ పెట్టుబడిగాను కొన్ని కుటుంబాలు గృహజ్యోతి ద్వారా అంది వచ్చిన డబ్బును వినియోగించుకుంటున్నాయి. ఈ మార్పు పేదరికం నుంచి బయటపడే దారులు చూపిస్తోంది.
సంపద పంపకం
పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం, కొత్తగా పరిశ్రమలు స్థాపించడం మూలంగా రాష్ట్రంలో ఉపాధి పెరుగుతోంది. ప్రభుత్వం ఆర్థిక భరోసా ఇవ్వకపోతే సొంత జేబులోంచి ఖర్చు పెట్టుకునేందుకు పేదలు, మధ్యతరగతి వర్గాల వారు కొనుగోలుకు సాహసం చేసేవారు కాదు. సంపద పంపిణీ కార్యక్రమంలో గృహజ్యోతి ఒక భాగం.
రాష్ట్ర సంపదను అర్హులకు పంచుతాం, సంపద సృష్టిస్తాం.. ఆ సంపదను పేదలకు పంచుతాం అని ఎన్నికల ముందు చెప్పాం అని డిప్యూటీ సీఎం చెపుతున్నారు. ప్రజలు నమ్మి అధికారాన్ని కట్టబెట్టారు. ఆ మేరకు సృష్టించిన సంపదను పేద, బడుగు, వర్గాలకు చేరవేస్తున్నాం. సమాజంలో ఆర్థిక, సామాజిక అంతరాలను తొలగించే ప్రయత్నం ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టింది.
ప్రపంచీకరణ తర్వాత నైపుణ్యాలు ఉన్నవారు మాత్రమే బతికే పరిస్థితి ఏర్పడింది. స్కిల్స్ లేని పేద, బడుగు, బలహీనవర్గాలు ఉపాధి అందుకు తగిన ఆదాయం లేక పేదలు మరింత
పేదరికంలోకి నెట్టి వేయబడ్డారు. ఈ వర్గాలకు ఊతం ఇవ్వాలని నిర్ణయించి అనేక సంక్షేమ పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తమ ఆచరణలో చూపిస్తున్నారు. విద్యుత్‌శాఖ మంత్రిగా గృహజ్యోతి పథకాన్ని ప్రతి ఊరూవాడాకు చేర్చడమే లక్ష్యంగా పనిచేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని సుమారు సగం కుటుంబాలు గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి.
- మారబోయిన మధుసూదన్, సీపీఆర్ఓ టు డిప్యూటీ సీఎం-