జీఎస్‌‌టీ వసూళ్లలో రికార్డ్‌.. ఏప్రిల్‌‌లో రూ.2.37 లక్షల కోట్ల ఆదాయం

జీఎస్‌‌టీ వసూళ్లలో రికార్డ్‌.. ఏప్రిల్‌‌లో రూ.2.37 లక్షల కోట్ల ఆదాయం

న్యూఢిల్లీ: జీఎస్‌‌టీ వసూళ్లు ఈ ఏడాది ఏప్రిల్‌లో రికార్డ్ గరిష్టాలకు చేరుకున్నాయి. ఫైనాన్షియల్ ఇయర్‌లో చివరి నెల కావడంతో  ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. కిందటేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్రాస్ జీఎస్‌‌టీ రెవెన్యూ 12.6 శాతం పెరిగి రూ. 2.37 లక్షల కోట్లకు చేరింది. జీఎస్‌‌‌‌‌‌‌‌టీ అమల్లోకి వచ్చాక ఇంతలా రెవెన్యూ వసూళ్లు కావడం ఇదే మొదటిసారి. కిందటేడాది ఏప్రిల్‌లో  రూ. 2.10 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.

ఈ ఏడాది మార్చిలో రూ. 1.96 లక్షల కోట్ల జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రెవెన్యూ వచ్చింది. దేశీయ లావాదేవీల నుంచి వచ్చిన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ ఆదాయం ఏడాది లెక్కన 10.7 శాతం పెరిగి సుమారు రూ. 1.90 లక్షల కోట్లకు చేరగా, దిగుమతి వస్తువుల నుంచి వచ్చిన ఆదాయం 20.8 శాతం పెరిగి రూ. 46,913 కోట్లకు ఎగసింది.  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో రిఫండ్‌‌‌‌‌‌‌‌ల జారీ 48.3 శాతం పెరిగి రూ. 27,341 కోట్లకు చేరింది. రిఫండ్‌‌‌‌‌‌‌‌ అమౌంట్‌‌ను తీసేస్తే  కిందటి నెలలో నికర జీఎస్‌‌టీ వసూళ్లు 9.1 శాతం పెరిగి రూ. 2.09 లక్షల కోట్లుగా రికార్డయ్యాయి.