జీఎస్టీ కౌన్సిల్‌‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

జీఎస్టీ కౌన్సిల్‌‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు

జీఎస్టీ (GST) కౌన్సిల్ చేసే సిఫార్సులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మండలి చేసిన సిఫార్సులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని తీర్పులో వెల్లడించింది. డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ తీర్పును ప్రకటించింది. జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలా ? వద్దా ? అనే దానిపై సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. 2007 ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (IGST) చట్టం ప్రకారం... సుముద్ర రవాణాపై పన్ను విధించడంపై గుజరాత్ హైకోర్టు తీర్పునిచ్చింది.

2017 ప్రభుత్వ నోటిఫికేషన్ ను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.  చట్టాన్ని రూపొందించడానికి పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు సమానమైన అధికారాలు కలిగి ఉంటాయని, అవసరమైతే వేర్వేరుగా చట్టాలు రూపొందించుకోవచ్చని తెలిపింది. ఆర్టికల్ 246A, 279 ప్రకారం... నిబంధనల ప్రకారం పన్నుల విషయాలపై చట్టాలు చేయడానికి సమాన అధికారాలు ఉంటాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఒకరి ఆదేశాలను మరొకరిపై బలవంతంగా రద్దవద్దని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరగాలని అభిప్రాయం వ్యక్తం చేసింది.

మరిన్ని వార్తల కోసం :-

సిద్ధూకు ఏడాది జైలు శిక్ష


ఉగ్రవాదులకు నిధుల కేసులో యాసిన్ మాలిక్ దోషి