ట్విట్టర్‌‌పై వచ్చే ఆదాయంపైన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ!

ట్విట్టర్‌‌పై వచ్చే ఆదాయంపైన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ!
  • ఏడాదికి రూ.20 లక్షలు దాటితే 18 శాతం ట్యాక్స్‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: రెవెన్యూ షేరింగ్ మోడల్‌‌‌‌‌‌‌‌లో ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వారు 18 శాతం జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కట్టాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి   రెంటల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌,  ఫిక్స్డ్‌‌‌‌‌‌‌‌ డిపాజిట్లపై వడ్డీ, ఇతర ప్రొఫెషనల్ సర్వీస్‌‌‌‌‌‌‌‌ల ద్వారా సంపాదిస్తున్న ఆదాయం ఏడాదిలో రూ.20 లక్షలు దాటితే  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ  కట్టాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.  ట్విట్టర్‌‌ తాజాగా రెవెన్యూ షేరింగ్ మోడల్‌‌‌‌‌‌‌‌ను తీసుకొచ్చింది. అంటే కంపెనీ తన కొచ్చిన యాడ్ రెవెన్యూని కంటెంట్‌‌‌‌‌‌‌‌ క్రియేటర్లతో పంచుకుంటోంది. ప్రీమియం సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు లేదా వెరిఫైడ్ ఆర్గనైజేషన్లు తమ పోస్టులపై మూడు నెలల్లో  కనీసం 1.5 కోట్ల ఇంప్రెషన్స్‌‌‌‌‌‌‌‌ (రియాక్షన్స్‌‌‌‌‌‌‌‌) సంపాదించగలిగి ఉండి, కనీసం 500 ఫాలోవర్లు ఉన్నవారు రెవెన్యూ షేరింగ్ మోడల్‌‌‌‌‌‌‌‌కు అర్హులు.   

కేవలం ఎక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మాత్రమే కాదని వడ్డీ ఆదాయం, రెంటల్ ఇన్‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌ వంటివి కూడా  జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రిజిస్ట్రేషన్ పరిమితిలకు మించి ఉంటే ట్యాక్స్ కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక వ్యక్తి లేదా సంస్థ ఏడాదికి రూ.20 లక్షల కంటే ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తే జీఎస్‌‌‌‌‌‌‌‌టీ రిజిస్ట్రేషన్ కచ్చితంగా చేసుకోవాలి. మిజోరాం, మేఘాలయా, మణిపూర్ వంటి స్పెషల్ కేటగిరీ రాష్ట్రాలకు ఈ లిమిట్ రూ.10 లక్షలు. ‘ఒక వ్యక్తి బ్యాంకుల నుంచి ఏడాదికి రూ.20 లక్షలు వడ్డీ ఆదాయం సంపాదిస్తున్నాడని అనుకుంటే ఆయన జీఎస్‌‌‌‌‌‌‌‌టీ చెల్లించాల్సిన అవసరం లేదు.  రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పనిలేదు. కానీ, ఆయన అదనంగా ట్విట్టర్ వంటి ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్ నుంచి  రూ. లక్ష సంపాదించాడని అనుకుంటే ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జీఎస్‌‌‌‌‌‌‌‌టీ కట్టాలి.