GTvs LSG : ఉత్కంఠ పోరులో గుజరాత్ విక్టరీ

GTvs LSG :  ఉత్కంఠ పోరులో  గుజరాత్ విక్టరీ

లక్నో సూపర్ జాయింట్స్ తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 135 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నోను కట్టడి చేసింది గుజరాత్. దీంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమయ్యింది. లక్నో ఓపెనర్లు కేఎల్ రాహుల్ 68 పరుగులు, కేల్ మెయర్స్ 24 పరుగులు చేశారు. కృనాల్ పాండ్యా 23 పరుగులు మినహా మిగతావాళ్లెవరూ పెద్దగా రాణించలేదు. ముగ్గురు డకౌట్ కావడం విశేషం. దీంతో  స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు లక్నో తడబడింది.  20 ఓవర్లలో 128 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లలో  మోహిత్ శర్మ , నూర్ అహ్మద్ లకు రెండేసి వికెట్లు, రషీద్ ఖాన్ కు ఒక వికెట్ పడ్డాయి.

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో  6 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. వృద్ది మాన్ సాహా 47, హార్ధిక్ పాండ్యా 66 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో   కృనాల్ పాండ్యా 2, స్టోయినస్ 2, నవీన్, అమిత్ మిశ్రాలకు ఒక్కో వికెట్ పడ్డాయి.